రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ ముందంజలో ఉన్నారు.
మూడవ రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి కేటీఆర్ సుమారు 2,621 ఓట్లతో ఆధిక్యతను కనబరుస్తున్నారు.రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి నిలవగా మూడో స్థానానికి బీజేపీ చేరింది.
అయితే కాంగ్రెస్, బీజేపీ మధ్యనే హోరాహోరీ పోరు కొనసాగుతోందని తెలుస్తోంది.ఇక సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు, కోరుట్లలో కల్వకుంట్ల సంజయ్, ఎల్బీనగర్ లో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, సికింద్రాబాద్ లో పద్మారావు, బాల్కొండలో వేముల ప్రశాంత్ రెడ్డి మరియు వనపర్తిలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు.







