ఈటెల టార్గెట్ గా కేటీఆర్ ' సైలెంట్ ' వ్యూహం ?

తెలంగాణ రాజకీయాలలో ఈటెల రాజేందర్ వ్యవహారం కాక రేపుతున్నట్టు గా కనిపిస్తోంది.

ఈ విషయంలో టిఆర్ఎస్ నాయకులు అంతా మూకుమ్మడిగా ఈటెల రాజేందర్ పై విమర్శలు చేస్తూ,  ఆయనపై అవినీతి ఆరోపణలు సంధిస్తూ కాక పుట్టిస్తున్నారు.

ఇక అంతే స్థాయిలో ఈటెల వర్గం కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం పై అనేక రకాలుగా విమర్శలు చేస్తోంది.భారీ ఎత్తున అనుచరులతో ఈటెల రాజేందర్ హైదరాబాద్ నుంచి హుజురాబాద్ కు ప్రయాణం చేయడం, ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారనే హడావుడి తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం అవుతుండడం, ఇలా ఎన్నో అంశాలు చోటు చేసుకుంటున్నాయి.

అసలు ఈటెల రాజేందర్ ను కెసిఆర్ టార్గెట్ చేసుకోడానికి కారణం,  ఈటెల రాజేందర్ కేటీఆర్ ను సీఎం గా చేసేందుకు ఒప్పుకోక పోవడమే అనేది టిఆర్ఎస్ లోనే వినిపిస్తున్న గుసగుసలు.అసలు ఇంత తతంగం జరుగుతున్నా, ఎక్కడా కేటీఆర్ ఈటెల రాజేందర్ వ్యవహారంలో నేరుగా స్పందించడం లేదు.

  కరోనా కారణంగా విశ్రాంతి లో ఉన్న కేటీఆర్ పూర్తిగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనిస్తూ,  ఎప్పటికప్పుడు తగిన ప్రణాళికను రూపొందిస్తూ  వస్తున్నారు .అలాగే తాను విమర్శలకు దిగితే పరిస్థితి వేరే రకంగా ఉంటుందనే అభిప్రాయంతో కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులతో తీవ్ర స్థాయిలో విమర్శలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.క్రమక్రమంగా ఈటెల పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేయించి,  ప్రజల లోనూ ఆయన పై వ్యతిరేకత పెరిగేలా చేయాలని , తద్వారా ఆయన ఏ పార్టీలోకి వెళ్లినా,  సొంత పార్టీ పెట్టినా,  తెలంగాణలో పెద్దగా ప్రభావం లేకుండా చూసేందుకు గట్టిగానే కృషి చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Advertisement

  అలాగే ఈ విషయంలో ఎమ్మెల్సీ కవిత సైతం సైలెంట్ గా ఉన్నారు .మామూలుగా అయితే ఇంతటి తీవ్ర స్థాయి వ్యవహారంపై ఆమె ఖచ్చితంగా స్పందించి తన స్పందనను తెలియజేసి ఉండేవారు.కానీ ఈటెల రాజేందర్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తి కావడం టిఆర్ఎస్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలలోనూ  పట్టు ఉన్న వ్యక్తి కావడం తదితర కారణాలతో,  అనవసరంగా తాము స్పందించి ఈ ఇష్యూ ని మరింత పెద్దది చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదనే అభిప్రాయంతోనే పార్టీలోని నాయకులతో విమర్శలు చేయిస్తూ, సైలెంట్ గా రాజకీయ వ్యూహాలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సీపీఎం..!!

Advertisement

తాజా వార్తలు