ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కేటీఆర్ సంచలన కామెంట్స్..!!

తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో సంచలన కామెంట్ చేశారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ దేశంలో ఏ ప్రభుత్వమైనా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఉండవు అని పేర్కొన్నారు.

అది అసాధ్యం కాబట్టే ప్రభుత్వాలు ప్రైవేటు రంగాలను ప్రోత్సహిస్తూ ఉద్యోగాలు నెలకొల్పే రీతిలో వ్యవహరిస్తాయాని స్పష్టం చేశారు.ప్రైవేటు రంగాలలో పెట్టుబడులు పెట్టే రీతిలో ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తాయని క్లారిటీ ఇచ్చారు.

KTR Sensational Comments About Government Jobs KTR, Telangana , Ts Govt , Ktr A

దేశంలో 18 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగిన జనాభా శాతం అధికంగా ఉండటంతో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వాలు ఉండవని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.ఏదిఏమైనా ప్రభుత్వాలు ప్రైవేట్ పెట్టుబడులు ప్రోత్సహించడానికి గల కారణం మరింత ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో సృష్టించడానికి అని ఈ రీతిలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు అసాధ్యమని అన్నారు.

 ఇదిలా ఉంటే ఒకపక్క కరోనా వైరస్ కారణంగా చాలా ప్రైవేటు కంపెనీలు మూతపడే పరిస్థితి లో ఉన్నాయి.కరోనా కట్టడి చేయడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు కంపెనీలు క్లోజ్ అవుతున్న తరుణంలో జీతాలు ఇవ్వలేక యాజమాన్యాలు నానా తంటాలు పడుతున్నారు.

Advertisement

ఏదిఏమైనా ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వపరంగా లేదా ప్రైవేటు పరం గా అయినా ఉద్యోగం సంపాదించడం అనేది గగనంగా మారింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు