ఏపీ అధికార పార్టీ వైసిపి తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ మధ్య ఎప్పుడు అంతగా విభేదాలు ఉన్నట్టు కనిపించ లేదు.ఒకరికొకరు అన్ని విషయాల్లో సహకరించుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది.
తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మధ్య ఎప్పటి నుంచో స్నేహం కొనసాగుతూ ఉండడం దీనికి కారణం.కేంద్ర అధికార పార్టీ బిజెపి టిఆర్ఎస్ విమర్శలు చేస్తుండగా, జగన్ మాత్రం సానుకూలంగానే బీజేపీ విషయంలో వ్యవహరిస్తున్నారు .ఈ విషయంలోనే వీరి మధ్య విభేదాలు తలెత్తినట్లుగా కనిపిస్తున్నాయి.దీనికి తగ్గట్లుగానే తెలంగాణ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి.
కొద్ది రోజుల క్రితం తన మిత్రుడు పండుగకు ఏపీ వెళ్లి వచ్చారు అని , వచ్చిన తర్వాత తనకు ఫోన్ చేశారని , అక్కడ నాలుగు రోజులు ఉండగా కరెంట్ లేదని, నీళ్లు లేవని, రోడ్లు సరిగా లేవని చెప్పారు అని కేటీఆర్ కామెంట్ చేశారు.
తెలంగాణలోని వాళ్లను నాలుగు రోజులు బస్సు లో ఏపీకి పంపాలని , అప్పుడు తెలంగాణ ప్రభుత్వం విలువ ఏంటో తెలుస్తుంది అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తాను చెప్పడం కాదని , మన వాళ్లు కూడా ఒకసారి ఏపీ కి వెళ్లి చూస్తే వాస్తవాలు ఏమిటో తెలుస్తాయని కేటీఆర్ అన్నారు.కేటీఆర్ వ్యాఖ్యలపై వైసిపి నాయకులు ఘాటుగానే స్పందించారు.
విజయవాడ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కెటిఆర్ కు కౌంటర్ ఇచ్చారు .కేసీఆర్ , కేటీఆర్ కూడా కబుర్లు చెబుతున్నారని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీ గురించి మాట్లాడే హక్కు టిఆర్ఎస్ నేతలకు లేదన్నారు. కరెంట్ రోడ్ లు ఉన్నాయో లేదో విజయవాడకు వచ్చి చూస్తే అర్థం అవుతుంది అన్నారు.

కోస్తా ప్రజల వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని , అలా అభివృద్ధి ప్రాంతం గా మారిన హైదరాబాద్ గురించి ఇప్పుడు టిఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు అంటూ మల్లాది విష్ణు మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వానికి వచ్చినన్ని అవార్డులు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చాయా అంటూ కేటీఆర్ ను ఉద్దేశించి మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు.ఇక మంత్రి జోగి రమేష్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు.ఏపీలో తమ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటో కళ్ళారా చూసి తెలుసుకోవాలని కేటీఆర్ సవాల్ చేశారు.







