విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ ప్రకటనను స్వాగతించాలని ఏపీ బీజేపీ నేత మాధవ్ అన్నారు.స్వార్థ రాజకీయాల కోసం స్టీల్ ప్లాంట్ ను బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటోందని విమర్శించారు.
బయ్యారం గనులు రాకుండా అడ్డుకుంది మీరు కాదా అని ప్రశ్నించారు.మంత్రి కేటీఆర్ కు అన్నీ తెలిసి కూడా అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ కు చిత్తశుద్ది ఉంటే సింగరేణిలో ఏపీ వాటా సంగతి తేల్చాలన్నారు.అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ సంగతి కూడా తేల్చాలని డిమాండ్ చేశారు.