సరికొత్త లీడర్ గా అవతరిస్తున్న కేటీఆర్ ?

తన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన కొత్తల్లో కేసీఆర్ కుమారుడుగా మాత్రమే తెలంగాణ ప్రజానీకానికి తెలిసిన కేటీఆర్ ఆరంభంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు.

రాజకీయాల్లో కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి కాదు అని డైరెక్ట్గా ఇంపోర్టు చేయబడ్డారని, తన రాజకీయ ప్రయాణానికి కెసిఆర్ పూలదారి ఏర్పాటు చేస్తే వచ్చి కూర్చున్న నాయకుడని ఇలా అనేక విమర్శలు వినిపించాయి.

అంతేకాకుండా అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతూ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో అహోరహం కష్టపడిన హరీష్ రావుకి( Harish rao ) చెక్ పెట్టడానికే కేటీఆర్ ను బలవంతంగా తెలంగాణ రాజకీయాల్లో రుద్దారని ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేసేవి. కేటీఆర్ వల్ల హరీష్ రావుకి అన్యాయం జరుగుతుందని , హరీష్ రావు పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నాడని కూడా అనేక ఊహగానాలు వచ్చేవి.

అయితే తన సమర్ధతతో నాయకత్వ లక్షణాలతో అద్భుతమైన వాక్ చాతుర్యం తో ప్రతిపక్షాల విమర్శలు అన్నిటికీ చరమగీతం పాడి తెలంగాణ రాజకీయాలలో తనదైన స్పష్టమైన ముద్రను వేసిన కేటీఆర్ అనతి కాలంలోనే సరికొత్త లీడర్ గా అవతరించారు.పార్టీ కార్యకర్తలతోనూ, ప్రభుత్వ అధికారులతోనూ అద్భుతమైన సమన్వయం సాధించి తన శాఖలను సమర్థవంతమైన పనితీరుతో ముందుకు తీసుకెళ్లిన ఘనత కల్వకుంట్ల తారక రామారావుదే అని చెప్పొచ్చు.తను చేపట్టిన ప్రతి శాఖకు వన్నె తీసుకొచ్చే విధంగా పనిచేసిన ఆయన, ఐటీ మినిస్టర్గా తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో ద్విగుణీకృతం చేశారని చెప్పవచ్చు .వాక్చాతుర్యంలోనూ తండ్రికి తగ్గ తనయుడు అని కీర్తించబడిన కేటీఆర్ ప్రతిపక్షాలపై చేసే విమర్శలలోను తనదైన మార్క్ చూపిస్తుంటారు .

ఐటి మినిస్టర్ గా కేటీఆర్( K.T.Rama Rao ) ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన కృషి పట్టుదల వల్లే అనేక అంతర్జాతీయ సంస్థలు తెలంగాణ కు క్యూ కట్టాయి .తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) తో ఎంఓయూలు చేసుకుని వేలమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి .ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలన్న సూత్రాన్ని మర్చిపోని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తనదైన శైలి లో పరిష్కరిస్తుంటారు .ప్రజలకు ట్విటర్ ద్వారా అందుబాటులో ఉంది పిలిస్తే పలుకుతారు అన్న పేరు తెచ్చుకున్నారు .ఆయన పుట్టినరోజు సందర్భంగా పార్టీలకతీతంగా ఆయనకు వచ్చిన శుభాకాంక్షలు వెలువ చూస్తే తెలంగాణ రాజకీయ యువనిక పై సరికొత్త నాయకుడిగా ఆయన ఎంత బలమైన ముద్రవేశారో అర్థమవుతుంది .ఇదే వేగాన్ని సమర్ధతను ఆయన భవిష్యత్తులో కూడా కొనసాగిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం ఆయనకు ఎంతో దూరంలో లేదని చెప్పవచ్చు .

Advertisement
ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో మరొకరు లేరా..? ఆయనకి ఎందుకంత క్రేజ్...

తాజా వార్తలు