బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.ట్యాక్స్ వసూలు చేయడానికి బీఆర్ఎస్ అలవాటు పడిందని తెలిపారు.
కే ట్యాక్స్ రూపంలో రూ.1,000 కోట్లు వసూలు చేశారని ఎంపీ కోమటిరెడ్డి ఆరోపించారు.కేటీఆర్ అజెండా ఫ్యామిలీ ఫస్ట్ ప్రజలు లాస్ట్ అని చెప్పారు.అదేవిధంగా త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తామ పాలనలో అవినీతిపరులను జైలుకు తప్పకుండా పంపుతామని హెచ్చరించారు.