కాతువాకుల రెండు కాదల్.. తెలుగు ట్రైలర్ చూశారా..!

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో నయనతార, సమంత హీరోయిన్స్ గా నటించిన సినిమా కాతువాకుల రెండు కాదల్.

విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 28న రిలీజ్ ప్లాన్ చేశారు.

తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుంది.విజయ్ సేతుపతికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది.

ఇక సమంత గురించి చెప్పాల్సిన పనిలేదు.మొత్తానికి కాతువాకుల రెండు కాదల్ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది.

లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ రిలీజ్ చేశారు.ఈ సినిమాను తెలుగులో కె.ఆర్.కె టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.సినిమా తెలుగు ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.

Advertisement

ఉప్పెన సినిమాలో శేషారాయణం పాత్రలో విజయ్ సేతుపతి అదరగొట్టారు.ఇక ఇప్పుడు కె.ఆర్.కె సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఈ సినిమాపై సమంత చాలా హోప్స్ పెట్టుకుంది.

నయనతార తెలుగు ఫ్యాన్స్ కూడా ఈ సినిమా గురించి ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.ఏప్రిల్ 28న కె.ఆర్.కె రిలీజ్ అవుతుండగా మరుసటి రోజే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య రిలీజ్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు