సూర్య సినిమాకు కృతిశెట్టి కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. ఎంత తీసుకుంటున్నారంటే?

తెలుగులోని సక్సెస్ ఫుల్ హీరోయిన్లలో కృతిశెట్టి ఒకరనే సంగతి తెలిసిందే.కృతిశెట్టి నటిస్తే సినిమా హిట్ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

 Krutishetty Shocking Remuneration For Hero Surya Movie Details, Krithi Shetty, H-TeluguStop.com

ఆ టాక్ కు అనుగుణంగా కృతిశెట్టి హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకున్నారు.బాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సూర్య సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా ఎంపికయ్యారని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాకు కృతిశెట్టి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెమ్యునరేషన్ కారణమని సమాచారం.

కృతిశెట్టికి తెలుగులో ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ కళ్లు చెదిరే మొత్తం ఆఫర్ చేశారని తెలుస్తోంది.కృతిశెట్టికి కోటిన్నర రూపాయలు రెమ్యునరేషన్ గా దక్కనుండగా ఇప్పటివరకు కృతిశెట్టి అందుకున్న మొత్తంతో పోల్చి చూస్తే ఇదే హైయెస్ట్ రెమ్యునరేషన్ కావడం గమనార్హం.18 సంవత్సరాల తర్వాత సూర్య బాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

సూర్య నటించి ఈ మధ్య కాలంలో థియేటర్లలో విడుదలైన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.

ఆకాశమే నీహద్దురా, జైభీమ్ సినిమాలు హిట్టైనా ఆ సినిమాలు ఓటీటీలో రిలీజయ్యాయి.సూర్య నటించిన ఈటీ గత నెల 10వ తేదీన థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.

సూర్య రొటీన్ మాస్ మసాలా సినిమాలకు దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.తమిళ దర్శకుడు బాల విభిన్నమైన సినిమాలు తెరకెక్కించి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే బాల కూడా ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ సాధించలేదు.

సూర్య కృతిశెట్టి బాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.సూర్య ఫాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube