‘ఉప్పెన’ చిత్రంతో ఒక్కసారిగా యావత్ టాలీవుడ్ దృష్టిని తనవైపు తిప్పుకుంది యంగ్ హీరోయిన్ కృతి శెట్టి.ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు మంచి మార్కులు వేయడంతో, ఆమెతో సినిమా చేసేందుకు హీరోలు వరుసగా క్యూ కడుతున్నారు.
అయితే ఈ బ్యూటీ మాత్రం చాలా సెలెక్టివ్‌గా సినిమాలను ఓకే చూస్తూ దూసుకుపోతుంది.ఈ క్రమంలో ఒకే ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరోలకు చుక్కలు చూపిస్తోందట ఈ బ్యూటీ.
ఇంతకీ ఈ బ్యూటీ ఎవరికి చుక్కలు చూపిస్తోందని అనుకుంటున్నారా.అయితే అసలు కథేమిటో తెలుసుకుందాం.
తొలి చిత్రం ఉప్పెన ఇచ్చిన జోష్‌తో కృతి తన నెక్ట్స్ చిత్రాలను ఇప్పటికే ఓకే చేస్తూ వెళ్తోంది.ఈ క్రమంలోనే యంగ్ హీరో నాని, రామ్ పోతినేనిలతో కలిసి తన నెక్ట్స్ చిత్రాలను తెరకెక్కించేందుకు ఈ బ్యూటీ రెడీ అయ్యింది.
కాగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన నెక్ట్స్ మూవీగా ‘బంగార్రాజు’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో యంగ్ హీరో నాగచైతన్య కూడా నటిస్తున్నట్లు నాగ్ ఇప్పటికే తెలిపాడు.
అయితే చైతూకి జోడీగా కృతి శెట్టిని తీసుకునేందుకు నాగ్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.కానీ కృతి శెట్టి మాత్రం ఈ సినిమాలో నటించేందుకు నో చెప్పినట్లు తెలుస్తోంది.
తన పాత్రకు అంతగా ప్రాముఖ్యత లేకపోవడంతోనే కృతి ఈ సినిమాకు నో చెప్పిందని వార్తలు వస్తున్నాయి.దీంతో నాగ్, చైతూలకు ఉప్పెన భామ ఝలక్ ఇచ్చిందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఏదేమైనా ‘బంగార్రాజు’ చిత్రానికి నో చెప్పిన కృతి శెట్టి ఇప్పుడు వార్తల్లో నిలవడంతో, ఆమె చేయబోయే నెక్ట్స్ చిత్రాలు ఎలా ఉంటాయా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.ఇక ఈ బ్యూటీ మరో యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ అనే సినిమాలో కూడా నటించేందుకు రెడీ అవుతోంది.
మరి కృతి శెట్టి నో చెప్పిన పాత్రలో నాగ్ ఎవరిని హీరోయిన్‌గా తీసుకుంటాడో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.







