మహేష్‌తో మరొక్కసారి అంటోన్న బ్యూటీ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో మహేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.కాగా ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Kriti Sanon Wishes To Do Movie With Mahesh Babu, Kriti Sanon, Mahesh Babu, Adipu

అయితే మహేష్ బాబుతో తనకు ఓ సినిమా చేయాలని ఉందంటూ ఓ బాలీవుడ్ బ్యూటీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.బాలీవుడ్‌లో స్టార్ బ్యూటీగా దూసుకుపోతున్న అందాల భామ కృతి సనన్, ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ చిత్రంలో నటిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఇక ఈ సినిమా తరువాత బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ సినిమా చేసేందుకు కృతి సనన్ ఆసక్తిగా ఉందట.గతంలో తన తొలి చిత్రం టాలీవుడ్ హీరో మహేష్ బాబుతో కలిసి చేయడం తనకు ఎప్పటికీ గుర్తుండే విషయమని ఆమె చెబుతోంది.

దీంతో మరోసారి మహేష్ బాబుతో కలిసి నటించే ఛాన్స్ తనకు వస్తే సంతోషంగా ఉంటానని ఆమె అంటోంది.అయితే మహేష్‌తో కృతి సనన్ చేసిన 1-నేనొక్కడినే బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది.

దీంతో అమ్మడికి తెలుగులో మరే ఇతర ఆఫర్ రాకపోవడంతో, ఆమె బాలీవుడ్‌కు చెక్కేసింది.అయితే అక్కడ మాత్రం కృతి సనన్‌కు అదిరిపోయే క్రేజ్ రావడంతో అక్కడ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది.

మరి మహేష్‌తో మరోసారి నటించాలనే కృతి సనన్ కోరిక నిజంగానే నెరవేరుతుందా లేక ఆశగానే మిగిలిపోతుందా అనేది వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు