Krithi Shetty Kushi : విజయ్-సమంత 'ఖుషి'లో కృతి శెట్టి స్పెషల్ రోల్!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కలిసి జంటగా నటిస్తున్న సినిమా ఖుషి.ప్రేమ కథలను తెరకెక్కించే డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను మరో అందమైన ప్రేమ కథగా మలుస్తున్నాడు.

 Krithi Shetty In Vijay Deverakonda And Samantha Khushi, Krithi Shetty, Samantha,-TeluguStop.com

కాశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథ ఇప్పటికే సగానికి పైగానే షూట్ పూర్తి చేసుకుంది.గత కొన్ని నెలల క్రితం ప్రకటించి షూటింగ్ కూడా వెంటనే స్టార్ట్ చేసారు.

కాశ్మీర్ లో అందమైన లొకేషన్స్ తో పాటు వైజాగ్ బీచ్, హైదరాబాద్ లో కూడా ఈ సినిమా షూటింగ్ జరిగింది.విజయ్ దేవరకొండ, సమంత జోడీగా నటిస్తున్నారు అంటే ఫ్యాన్స్ కు ఈ సినిమాపై బాగా ఆసక్తి కలిగింది.

ఈ సినిమాలో వీరిద్దరి జోడీ ఫ్రెష్ గా అనిపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.అందుకే వీరిద్దరూ జంటగా నటిస్తున్న ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ తో పాటు సామ్ ఫ్యాన్స్ కూడా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

అయితే ప్రెజెంట్ సామ్ అనారోగ్యం కారణంగా ఈ షూట్ ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.

ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించ బోతుంది అని టాక్.ఆమె మరెవరో కాదు.

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి అని తెలుస్తుంది.ఈమె ఈ సినిమాలో సెకండాఫ్ లో కీలక పాత్రలో నటించ బోతుందట.

అంతేకాదు ఈమె క్యారెక్టర్ కూడా కొత్తగా ఉండబోతుందట.

Telugu Krithi Shetty, Kushi, Mytri Makers, Samantha, Shiva Nirvana-Movie

నెగిటివ్ షేడ్స్ తో సాగే ఈ క్యారెక్టర్ చివరకు ఎమోషనల్ గా టర్న్ అవుతుందట.మరి ఈమె క్యారెక్టర్ అంత ఇంట్రెస్టింగ్ గా ఎలా మలచబోతున్నాడు? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ వార్తపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ వస్తే కానీ అసలు విషయం తెలియదు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హీషమ్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా మీదనే ఇటు విజయ్, సమంత, అటు శివ నిర్వాణ ఆశలు పెట్టుకున్నారు.

మరి ఈ లవ్ స్టోరీ ఈ జోడీకి ఎలాంటి హిట్ అందిస్తుందో వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube