ఉప్పెనతో( Uppena ) ఫస్ట్ మూవీనే సూపర్ హిట్ అందుకున్న కృతి శెట్టి( Kriti Shetty ) ఆ తర్వాత వరుస క్రేజీ ఆఫర్లు అందుకుంది.అయితే ఆఫర్లు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేసిన అమ్మడు వరుస ఫ్లాపులు షాక్ ఇవ్వడంతో సెట్ రైట్ అయ్యింది.
లాస్ట్ ఇయర్ వరుసగా 3 సినిమాలు ఫెయిల్యూర్ అవడంతో కెరీర్ లో డీలా పడిన అమ్మడు తన నెక్స్ట్ సినిమాల మీద ఫోకస్ పెట్టింది.ప్రస్తుతం నాగ చైతన్యతో కస్టడీ చేస్తున్న కృతి శెట్టి శర్వానంద్( Sharwanand ) తో ఒక సినిమా ఓకే చేసింది.
ఈ సినిమాలో కృతి శెట్టి పాత్ర చాలా బాగుంటుందని అంటున్నారు.

ఉప్పెన తర్వాత కృతి శెట్టికి పాత్ర ప్రాధాన్యత ఉన్నట్టుగా తెలుస్తుంది.శర్వానంద్ కూడా మంచి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు.అందుకే కృతి శెట్టి పాత్ర మీద ఫోకస్ చేశారట.
యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న కృతి శెట్టిని వాడుకుని సినిమాను సక్సెస్ చేసుకోవాలని చూస్తున్నారు.కృతి శెట్టి కూడా అర్జెంట్ గా హిట్ కొట్టాలని తాపత్రయపడుతుంది.
ఇక మీదట కథల విషయంలో చాలా జాగ్రత్త పడాలని చూస్తుంది.మరి అమ్మడికి రాబోతున్న రెండు సినిమాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి.







