రెబల్ స్టార్ కృష్ణంరాజు( Krishnam Raju ) గత ఏడాది సెప్టెంబర్ 11వ తేదీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాదులోని ఏఐజి హాస్పిటల్ లో మరణించిన సంగతి మనకు తెలిసిందే.ఈ విధంగా వయసు పైబడి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ చివరికి మరణించారు.
ఈ విధంగా కృష్ణంరాజు మరణించి సెప్టెంబర్ 11వ తేదీకి సంవత్సరం అయినప్పటికీ ఈ ఏడాది అధికమాసం వచ్చినటువంటి సందర్భంగా రెండురోజులక్రితమే సంవత్సరీకం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా కృష్ణంరాజు భార్య శ్యామల దేవి( Syamala Devi ) తో పాటు ఆయన కుమార్తెలు కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం జూబ్లీహిల్స్‌లోని వారి స్వగృహంలో వేదోక్తంగా జరిగింది. ప్రభాస్ ( Prabhas ) సోదరుడు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ప్రభాస్ సోదరుడు పాల్గొన్నారు.అయితే ప్రభాస్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు ఈయన ప్రస్తుతం విదేశాలలో మోకాలు సర్జరీ( Prabhas Leg Surgery ) చేయించుకుని అక్కడే ఉన్న విషయం మనకు తెలిసిందే.
అందుకే ఈ కార్యక్రమానికి ప్రభాస్ హాజరు కాలేకపోయారు.కృష్ణంరాజు మరణించిన తర్వాత ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ఆ విగ్రహాన్ని శ్యామలాదేవి తన ఇంట్లోనే ఉంచారు దీంతో ఆయన విగ్రహాన్ని ఎంతో అందంగా అలంకరించి ఈమె సంవత్సరీకం వేడుకలను కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమం అనంతరం కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో పాటు ఆయన స్టాఫ్ బంధువులందరూ కూడా కృష్ణంరాజు విగ్రహానికి నమస్కరించారు.శ్యామలాదేవిగారు మాట్లాడుతూ, వారికి స్వీట్లు అంటే ప్రియం.అందుకే ఆయనకు తీపి తినిపిస్తున్నానని చెబుతూ, విగ్రహానికి పెడుతూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.కృష్ణంరాజు కుటుంబ సభ్యులందరూ కూడా ఎమోషనల్ అయ్యారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.