క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ( krishnavamsi ) గత నాలుగు సంవత్సరాలుగా రంగమార్తాండ( Rangamarthanda ) సినిమా ను చేస్తున్న విషయం తెలిసిందే.మరాఠీ మూవీ నటసామ్రాట్ కి ఇది రీమేక్ అనే విషయం అందరికీ తెలిసిందే.
ఒక రీమేక్ సినిమా ను ఇన్నాళ్లు చేయడం ఏంటి అంటూ చాలా మంది విమర్శలు కురిపించారు.కృష్ణవంశీ ఈ రీమేక్ సినిమా కోసం చాలా కష్టపడ్డట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.
ముఖ్యంగా నిర్మాణ బాధ్యతలను కూడా తానే భుజాన వేసుకున్నాడట.దాంతో తన సర్వం రంగమార్తాండ సినిమా కు పెట్టడం తో రిస్క్ లో పెట్టినట్లు అయ్యింది.
ఇటీవల రంగమార్తాండ సినిమా ను మైత్రి మూవీ మేకర్స్( Mythri Movie Makers ) వారు హోల్ సేల్ గా కొనుగోలు చేశారు.దాంతో కాస్త కమర్షియల్ గా కుదుటపడ్డ కృష్ణవంశీ సినిమా విడుదలై సక్సెస్ దక్కించుకొని కమర్షియల్ గా మంచి వసూలు రాబడితేనే అప్పుడు కృష్ణవంశీ ఆర్థిక పరిస్థితి గాడిన పడుతుందని ఆయన సన్నిహితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గత కొన్నాళ్లుగా కృష్ణ వంశీ పూర్తి దృష్టి ఈ సినిమా పైనే ఉంది.కనుక తప్పకుండా కృష్ణవంశీ రంగమార్తాండ సినిమా తో సక్సెస్ అవ్వాల్సిన అవసరం ఉంది.ఇటీవలే ప్రీమియర్ చూసిన కొందరు మీడియా వారు సినిమా పై పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు.ఒక మంచి కుటుంబం నడపాలనుకునే వ్యక్తి తప్పకుండా రంగమార్తాండ సినిమా ను చూడాలి.
తన ఫ్యామిలీ అందరికీ కూడా రంగమార్తాండ సినిమా ను చూపించాలి అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.రంగమార్తాండ సినిమా లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, శివాత్మిక, రాజశేఖర్ రాహుల్ సిప్లిగంజ్, బ్రహ్మానందం ఇంకా ఎంతో మంది ప్రముఖ నటీనటులు నటించారు.
ఇళయరాజా సంగీతాన్ని అందించారు.ఒక అద్భుతమైన క్లాసికల్ మూవీ గా రంగమార్తాండ నిలుస్తుందని కృష్ణవంశీ అభిమానులు ధీమాతో ఉన్నారు.







