సినిమా ఇండస్ట్రీ లో ఏదో ఒక చిన్న క్యారెక్టర్ దొరికితే చాలు చేద్దాం అనుకునే ఆర్టిస్టుల దగ్గర నుంచి రోజు కి లక్షల్లో తీసుకునే ఆర్టిస్టులుగా మారిన వాళ్ళు ఇండస్ట్రీ లో చాలా మందే ఉన్నారు.కానీ కొందరు మాత్రం వాళ్ళకి వచ్చిన క్యారెక్టర్స్ ని చేస్తూ ఇండస్ట్రీ లో మంచి పేరు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు.
ఈ విషయం లో నటుడు సమీర్ ( Sameer )గురించి ప్రత్యేకంగా చెప్పాలి.ఎందుకంటే ఈయన రాజమౌళి( Rajamouli ) తీసిన శాంతి నివాసం సీరియల్ దగ్గర నుండి ఆయన తీసిన చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అలాగే ప్రస్తుతం చాలా సినిమాల్లో నటిస్తూ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.
చాలా పెద్ద సినిమాల్లో కూడా నటిస్తున్నాడు అయితే ఒకరోజు నాగబాబు( Naga Babu ) సమీర్ ని తిట్టారట ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమా బాలేదు అని సోషల్ మీడియా లో ఎక్కడో ఒక చిన్న పోస్ట్ పెట్టాడట అందుకే ఆయనకి నాగబాబు కాల్ చేసి నువ్వు అలా పెట్టకూడదు డిలేట్ చేయి అని చెప్పాడట అయితే ఇది ఏ సినిమా విషయం లో జరిగింది అంటే పవన్ కళ్యాణ్ తమిళ్ డైరెక్టర్ అయినా విష్ణువర్ధన్ డైరెక్షన్ లో చేసిన పంజా సినిమా టైం లో జరిగిందట.

ఆ సినిమా చూసిన సమీర్ సూపర్ హీరో ని అసలు వాడుకోవడం ఎలానో తెలియలేదు డైరెక్టర్ కి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అని పోస్ట్ తానే రాసి పెట్టాడట అది చూసి నాగబాబు తీసేయమని చెప్పాడట ఎందుకంటే ఇండస్ట్రీ లో ఉన్న మనమే ఇలా పోస్ట్లు పెడితే బాగుండదు.అలా చేస్తే సినిమాకి నెగిటివ్ పబ్లిసిటీ వస్తుంది అందుకని మనం అలా పెట్టద్దు ప్రొడ్యూసర్ గురించి కూడా ఆలోచించాలి అని చెప్పాడట దాంతో సమీర్ కూడా అవును కరెక్టే కదా నేను అసలు ఇలా ఆలోచించలేదు అభిమాన హీరో సినిమా ప్లాప్ అవ్వడంతో ఆపుకోలేక ఆలా పెట్టాను ఇప్పుడే డిలేట్ చేస్తాను సర్ అని చెప్పి ఆ పోస్ట్ ని డిలేట్ చేసాడట.

ఇక ఇప్పటిదాకా బాగానే ఉంది కానీ అత్తారింటికి దారేది సినిమా టైములో ఆ సినిమా లో నటిస్తున్న సమీర్ కి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక సీన్ ఉందట ఆరోజు పవన్ కళ్యాణ్ సమీర్ ని పిలిచి నవ్వుతు నీకు పంజా సినిమా నచ్చలేదా సమీర్ అని అడిగి ఆయన్ని ఆట పట్టించారట…చివరికి పవన్ కళ్యాణ్ కొరికే జోక్ గా అన్నాను సమీర్ ఇవేమి పట్టించుకోను అని చెప్పాడట…దాంతో సమీర్, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం గురించి లైట్ గానే తీసుకున్నారు అని సంతోషపడ్డాడట…ఆ తరువాత వీళ్ల కాంబోలో కూడా చాలా సినిమాలు వచ్చాయి…
.







