ఈ మధ్య కాలంలో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన సమయంలో చరణ్, తారక్ అభిమానులు తమ హీరో గ్రేట్ అంటే తమ హీరో గ్రేట్ అంటూ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.అయితే అభిమానులు ఇలా గొడవలు పడటం వల్లే మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కడం లేదని కొంతమంది సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే ఇలాంటి గొడవలు జరగడం ఇదే తొలిసారి అయితే కాదు.గతంలో కూడా ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.
ప్రముఖ నటుడు, నిర్మాత మురళీ మోహన్ నిర్మాతగా కృష్ణ నాగార్జున కాంబినేషన్ లో వారసుడు అనే సినిమాను నిర్మించారు.ఈ సినిమా గురించి మురళీ మోహన్ మాట్లాడుతూ ఇద్దరు హీరోలు ఒకే మూవీలో నటిస్తే కథను, పాత్రలను బట్టి మూవీని చూడాల్సి ఉంటుందని అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతుంటాయని తను నిర్మించిన వారసుడు సినిమా విషయంలో అదే జరిగిందని ఆయన తెలిపారు.

వారసుడు సినిమాలో ఒక సందర్భంలో కృష్ణ నాగార్జునతో నువ్వెంత అంటూ వాదించడం జరుగుతుంది.నాగార్జున ఆ సీన్ లో కృష్ణగారిని పట్టుకుని మాట్లాడతాడు.ఈ సీన్ వల్ల మూవీ రిలీజైన తర్వాత కృష్ణ ఫ్యాన్స్ తనతో గొడవ పడ్డారని మురళీమోహన్ చెప్పుకొచ్చారు.కృష్ణ తన పాత్ర ఎంతో నచ్చడంతో ఆ సినిమాలో నటించారని తాను కూడా కృష్ణ ఫ్యాన్స్ కు అదే విషయాన్ని చెప్పి పంపించానని ఆయన అన్నారు.
కృష్ణ గొప్పదనం గురించి మురళీ మోహన్ మాట్లాడుతూ సినిమా ఫ్లాపైతే నిర్మాతలను ఆదుకునే విషయంలో కృష్ణ ముందువరసలో ఉంటారని ఆయన వెల్లడించారు.నిర్మాతల దగ్గర డబ్బులు లేకపోయినా కృష్ణ అండగా నిలబడి సాయం చేసేవారని ఆయన పేర్కొన్నారు.
కృష్ణ గొప్పదనం గురించి మురళీ మోహన్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.







