కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు మూత పడటంతో సినిమాలన్నీ ఒటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి.చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్ని కూడా ఓటీటీ బాట పడుతున్నాయి.
థియేటర్లు ఎప్పటికి తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొని ఉండటంతో నిర్మాతలు కూడా డిజిటల్ లో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.అందులో రిలీజ్ చేస్తున్న సినిమాలకి భాగానే డబ్బులు వస్తున్నాయి కూడా.
తాజాగా తెలుగులో క్షణం దర్శకుడు రవికాంత్ పేరుపు దర్శకత్వంలో తెరకెక్కిన కృష్ణ అండ్ హిస్ లీల సినిమా డిజిటల్ లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.సురేష్ బాబు నిర్మించిన ఈ చిన్న సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులని అలరించింది.
ఇలాంటి సినిమాలకి ఒటీటీలో ఆదరణ భాగానే ఉంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని దర్శకుడు రవికాంత్ ప్లాన్ చేస్తున్నాడు.
అయితే మూడేళ్ళ క్రితం తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కావడానికి ఇంత సమయం పట్టింది.మళ్ళీ దీనికి సీక్వెల్ అంటే ఇప్పట్లో అయ్యేపనేనా అనే చర్చ నడుస్తుంది.
ఇక వేళ సీక్వెల్ అంటే మళ్ళీ సురేష్ బాబు ఈ ఓటీటీ సినిమాపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తాడా అనే విషయం కూడా ఆలోచించాలి.అయితే ప్రస్తుతం ఈ సినిమాకి వస్తున్న బజ్ బట్టి సీక్వెల్ తీసిన కూడా వర్క్ అవుట్ అవుతుందని అనే టాక్ కూడా వినిపిస్తుంది.