రకుల్ కోసం ప్లాన్ మార్చిన క్రిష్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్‌లో ఒకరైన క్రిష్ ప్రస్తుతం వరుసగా రెండు సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోయే ఓ సినిమాతో పాటు మెగా హీరో వైష్ణవ్ తేజ్ రెండో చిత్రాన్ని కూడా క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు.

కాగా పవన్ సినిమాకు ఇంకా సమయం పడుతుండటంతో వైష్ణవ్ తేజ్ సినిమా షూటింగ్‌ను ఇటీవల మొదలుపెట్టాడు.ఇక ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Krish Changes Plan For Rakul, Krish, Rakul Preet Singh, NCB, Vaishnav Tej, Tolly

కాగా ఈ సినిమా షూటింగ్‌ను వికారాబాద్ అడవుల్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్‌ను క్రిష్ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఆమె పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించనుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.కాగా ఇటీవల బాలీవుడ్‌ను షేక్ చేస్తోన్న డ్రగ్స్ వినియోగం అంశంలో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

డ్రగ్స్ వినియోగంలో ఆమె రకుల్ పేరును బయటపెట్టడంతో రకుల్ చేస్తున్న సినిమాలు డైలమాలో పడ్డాయి.ఈ క్రమంలోనే క్రిష్ డైరెక్ట్ చేస్తున్న చిత్రానికి సంబంధించి కొన్ని కీలక మార్పులు చేశారు.

తొలుత వైష్ణవ్ తేజ్‌కు సంబంధించిన సీన్స్‌ను తెరకెక్కించాలని క్రిష్ భావించాడు.కానీ ఇప్పుడు రకుల్ ప్రీత్‌కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే రకుల్ షూటింగ్‌లో పాల్గొంటుండటంతో వీలైనంత త్వరగా ఆమె భాగానికి సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఇక ఈ సినిమా షూటింగ్‌ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలని క్రిష్ అండ్ టీమ్ భావిస్తోంది.

మరి ఈ సినిమాతో రకుల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

13 ఏళ్లకే పెళ్లి మాటెత్తిన డబ్బింగ్ జానకి.. ఆమె లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు..?
Advertisement

తాజా వార్తలు