మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘క్రాక్’ ఇటీవల షూటింగ్ పనులు ముగించుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి హిట్ కొడుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు తీర్చిదిద్దిన సంగతి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్లు చూస్తే అర్థమవుతుంది.అయితే ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
కాగా వేసవిలోనే రిలీజ్ కావాల్సిన క్రాక్ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారని పలు వార్తలు చక్కర్లు కొట్టాయి.
కానీ ఈ సినిమాను ఏదేమైనా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ పదేపదే చెబుతూ వచ్చింది.ఎందుకని సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందని అందరిలో సందేహం నెలకొంది.
అయితే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందని చిత్ర యూనిట్ ఫుల్ ధీమాగా ఉన్నారు.ఈ సినిమాలో మాస్ రాజాను ఎలివేట్ చేసిన విధానం, కథ పరంగా ఆయన్ను చూపించిన తీరు ప్రేక్షకులను అలరించడం ఖాయమని, అందుకే ఈ సినిమాను థియేటర్లలోనే చూస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ పట్టు పట్టింది.
అంతేగాక ఈ సినిమా రఫ్ ఔట్‌పుట్‌ను చూసిన చిత్ర యూనిట్ సభ్యులు ఇలాంటి సినిమాను థియేటర్లలో చూస్తే ఆ కిక్కే వేరంటున్నారు.మొత్తానికి ఈ సినిమా రిలీజ్ కాకముందే చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమాకు రివ్యూ ఇచ్చేస్తుండటంతో ఈ సినిమా నిజంగా అంత బాగుంటుందా అనే ఆసక్తి అటు మాస్ రాజా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా నెలకొంది.
ఇక గతకొంత కాలంగా సరైన బాక్సాఫీస్ హిట్ లేని రవితేజ ఈ సినిమాతో అదిరిపోయే రేంజ్‌లో బౌన్స్ బ్యాక్ అవుతారని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.ఇక ఈ సినిమాలో రవితేజ సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.