కోవై సరళ హీరోయిన్ గా నటించిన సినిమా ఏంటో తెలుసా ?

కమెడియన్స్ అనగానే అందరికి టక్కున గుర్తచ్చే పేర్లు అలీ, బ్రహ్మ్మనందం లాంటి వారే.ఎన్నో ఏళ్లుగా వీరు కామెడి చేస్తూ జనాలను నవ్విస్తూనే ఉన్నారు.

 Kovai Sarala Movie As Heroine Details, Kovai Sarala, Heroine Kovai Sarala, Lady-TeluguStop.com

ఇక బ్రహ్మానందం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నదంటే కారణం అయన కంబినేషన్స్ అద్భుతంగా వర్క్ అవుట్ అవ్వడమే.ఉదాహరణకు లేడీ కమెడియన్ కోవై సరళ తో బ్రహ్మానందం ఎక్కువ గా సినిమాల్లో నటించే వారు.

వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు అంటే పిచ్చ పిచ్చగా నవ్వుకోవచ్చు అని జనాలు కూడా ఫిక్స్ అవ్వచ్చు.అంతగా వీరి కంబినేషన్ కొన్నేళ్ల పాటు అద్భుతంగా నడిచింది.

తొలితరం కమెడియన్స్ లో రామ ప్రభ, రాజా బాబు పెయిర్ తర్వాత బ్రహ్మానందం మరియు కోవై సరళ పెయిర్ గురించి అందరు ఆసక్తిగా ఎదురు చూస్తారు.బ్రహ్మానందంతో పోటీ పడి మరి కోవై సరళ తెర పైన నవ్వులు పూయించేది.

ఇక ఇప్పటికి క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమా చూస్తూ ఉంటె వీరి కామెడి టైమింగ్స్ కి కడుపుబ్బా నవ్వాల్సిందే.అంతలా ఈ జంట తెలుగు సినిమా పరిశ్రమలో పాపులర్ కమెడియన్స్ గా మారిపోయారు.

కొన్ని వందల సినిమాల్లో ఇద్దరు కలిసి నటించగా దాదాపు అన్ని సినిమాలు విజయవంతం అయ్యాయి.

ఇక ఆ తర్వాత కాలంలో ఇద్దరు తమ తమ కెరీర్ ని విడివిడిగా కొనసాగించిన ప్రస్తుతం ఫేడవుట్ అయ్యారనే చెప్పుకోవాలి.

Telugu Brahmanandam, Kovai Sarala, Kamal Hasan, Kovaisarala, Lady, Rajababu, Ram

అయితే కేవలం లేడీ కమెడియన్ గా మాత్రమే తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న కోవై సరళ హీరోయిన్ గా కూడా నటించింది అనే విషయం ఎవరికి తెలియదు.ఒక మలయాళీ కుటుంబంలో కోయంబత్తూర్ లో జన్మించిన కోవై సరళ కు చిన్ననాటి నుంచే నటన అంటే అమితమైన ఇష్టం.ఎం.జి.ఆర్ అంటే ఆమెకు మహా ప్రాణం.దాంతో చదువు మధ్యలోనే ఆపేసి వెళ్లిరథం అనే సినిమాలో తొలిసారి నటించింది.

Telugu Brahmanandam, Kovai Sarala, Kamal Hasan, Kovaisarala, Lady, Rajababu, Ram

ఇక ఆ తర్వాత భాగ్య రాజా సినిమా అయినా చిన్నవీడు చిత్రంలో కూడా నటించింది.ఈ సినిమాలో భాగ్య రాజాకు తల్లిగా నటించింది.ఆలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయినా సరళ లోని నటిని గుర్తించిన కమల్ హాసన్ ఆమెకు ఒక మంచి అవకాశం ఇచ్చారు.అయన సినిమా అయినా సతీలీలావతి చిత్రాల్లో కమల్ సరసన ఏకంగా హీరోయిన్ గా నటించడానికి తీసుకున్నారు.

ఈ చిత్రంలో 1993 లో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది.ఈ సినిమాలో కోవై సరళ నటన కూడా ఎంతో చక్కగా ఉంటుంది.కామెడీ ప్రధాన సినిమా అయినా సతీలీలావతి సినిమానే హీరోయిన్ గా ఆమెకు మొదటి మరియు ఆఖరి సినిమా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube