సొమ్ము సింగరేణిది సోకు కెసిఆర్ ది..కోటూరి మానవతారాయ్

సింగరేణి బొగ్గు గనుల వేలం ప్రైవేటీకరణ విషయంలో నరేంద్ర మోడీ తీసుకువచ్చిన మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 2015 బిల్లుకు పార్లమెంట్లో అప్పటి టిఆర్ఎస్ ఇప్పటి బిఆర్ ఎస్( BRS PARTY ) ఎంపీలు అప్పుడు ఎంపీగా ఉన్న కేసీఆర్ కుమార్తె కవితతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR ) ఆదేశాల మేరకు మొత్తం 14 మంది ఎంపీలు మద్దతు తెలిపి సింగరేణి సంస్థ నాశనానికి పూనుకున్నారని కెసిఆర్ సింగరేణి సంస్థ రక్షకుడు కాదని సింగరేణి సంస్థ భక్షకుడని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ (Koturi Manavatha Roy )సోమవారం ఒక ప్రకటనలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పై మండిపడ్డారు.

 Koturi Manavatha Roy Comments On Kcr ,. Singareni , Koturi Manavatha Roy , Kc,-TeluguStop.com

కెసిఆర్ ప్రభుత్వం సింగరేణి సంస్థకు ట్రాన్స్కో జెన్కో విద్యుత్ సంస్థలు బకాయి పడ్డ 18 వేల కోట్లు ఇవ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎగ్గొడుతూ సింగరేణి సంస్థ ధనం దుర్వినియోగం చేస్తూ సింగరేణి సొమ్ముతో సీఎం కేసీఆర్ సోకులు పడుతుండని ఈ తతంగం అంతా చూస్తే సొమ్ము సింగరేణి సంస్థది,సోకు కెసిఆర్ ది అన్నట్టు ఉందని మానవతారాయ్ ఎద్దేవా చేశారు.

సత్తుపల్లి వెంగళరావునగర్,ఎన్టీఆర్ నగర్,రేజర్ల, కిష్టారం, కొత్తూరు సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ ఇళ్ల బాధితులను ఆదుకోకుండా సంబరాలు చేసుకోవటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.ఓవర్ బర్డెన్ పేరుతో సింగరేణి( Singareni ) బొగ్గు గనులను ప్రైవేటు యాజమాన్యాల చేతిలో పెట్టి దోపిడి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికీ సింగరేణి సంస్థ రక్షకుడు కాలేడని స్పష్టం చేశారు.

సింగరేణి ప్రభావిత ప్రాంతాల సంక్షేమానికి ఇచ్చే సంక్షేమ నిధులన్నీ సత్తుపల్లిలో ఖర్చు చేయకుండా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నాడని మానవతారాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించకుండా సంబరాలు చేసుకోవటం అవసరమా అని మానవతారాయ్ ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube