కోనసీమ జిల్లాలో పోలీసులపై ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.సంక్రాంతి పండుగ సందర్భంగా రావులపాడులో నిర్వహిస్తున్న కోడి పందాలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
దీంతో పోలీసుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ ఏరియాలోకి పోలీసులు ఎలా వస్తారని ప్రశ్నించారు.
అనంతరం పందెం బరుల వద్ద నుంచి పోలీసులు వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు.దీంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.







