ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) కెరీర్ లో 30వ సినిమా చేస్తున్నాడు.టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దేవర”( Devara movie ).
ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో ఈ సినిమాకు మరింత హైప్ పెరిగింది.
ఈసారి తారక్ తో కొరటాల యదార్ధ సంఘటనల ఆధారంగా మూవీ చేస్తున్నాడు.
దళితులపై అగ్రవర్ణాల వారు చేసిన మారణకాండను ఈ సినిమాలో చూపించ నున్నారని ఇప్పటికే రూమర్స్ వైరల్ అయ్యాయి.ఇక ఫస్ట్ లుక్ లో తారక్ ను మాస్ హీరోగా అదిరిపోయే లుక్ లో చూపించి కొరటాల ఆకట్టు కున్నాడు.ఇది పాన్ ఇండియన్ సినిమా కావడంతో అన్ని ఇండస్ట్రీలోని నటీనటులను ఎంపిక చేస్తూ ఈ సినిమాపై హైప్ భారీగా పెంచుతున్నాడు.
తాజాగా మరొక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమాలో ఒక వైల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని.నేపథ్యంలో ఈ ఫ్లాష్ బ్యాక్ ను విజువల్ యాక్షన్ వండర్ గా కొరటాల తీర్చి దిద్దుతున్నాడు అని తెలుస్తుంది.ఇక ఈ ఫ్లాష్ బ్యాక్ యాక్షన్ సీక్వెన్స్ లో తారక్ రగ్గడ్ అండ్ రఫ్ లుక్ లో కనిపిస్తాడని ఈ యాక్షన్ ఎపిసోడ్ ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ అని చెబుతున్నారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) ఫిక్స్ కాగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వబోతుంది.
కాగా వీరి కాంబోలో ఇప్పటికే వచ్చిన జనతా గ్యారేజ్( Janatha Garage ) సూపర్ హిట్ అవ్వడంతో ఈ మూవీ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.