మాజీ డిజిపి సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాష్ అరెస్ట్

ట్రాఫిక్ ఈ-చలానా రుసుములను తన సొంత ఖాతాకు మళ్లించుకుని పోలీసు శాఖకు భారీగా టోకరా వేసిన కొమ్మిరెడ్డి అవినాష్ను ఎట్టకేలకు పోలీ సులు అరెస్టు చేశారు.ఆయనకు చెందిన 16 ఆస్తు లను సీజ్ చేశారు.

 Kommireddy Avinash Arrest In E-challan Scam, Kommireddy Avinash, Kommireddy Avin-TeluguStop.com

ఈ వ్యవహారంలో లోపాలపై డీజీపీ అంతర్గత విచారణకు ఆదేశించారు.వాహనదా రులకు చెందిన ట్రాఫిక్ పెనాల్టీ రుసుములను ‘రేజర్ పే’ అనే పేమెంట్ గేట్వే ద్వారా డీజీ ఖాతాకు జమ చేస్తామని ఒప్పందం చేసుకున్న అవినాష్ రేజర్ పేకు బదులు రేజర్ పీఈ అనే నకిలీ యాప్ సృష్టించి పెనాల్టీల సొమ్మును పెద్ద మొత్తంలో దారి మళ్లిం చారు.

గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసు స్టేషన్లో దీనిపై కేసు నమోదైంది.అవినాష్ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశామని గుంటూరు ఐజీ పాలరాజు మంగళవారం మీడియాకు వెల్లడించారు.2018 నుంచి 2019 జనవరి వరకు రూ.36.58 కోట్ల ఈ-చలానా సొమ్మును అవినాష్ తన ఖాతాకు మళ్లించుకున్నట్లు తేలిందని చెప్పారు.ఈ కేసులో ఎ2గా ఉన్న రాజశేఖర్ను ఇప్పటికే అరెస్టు చేశామన్నారు.ప్రధాన నిందితుడు అవినాష్ కోసం ప్రత్యేక బృందాలు మూడు రాష్ట్రాల్లో గాలించి అరెస్టు చేశాయని తెలిపారు.

కొల్లగొట్టిన సొమ్ముతో క్లౌడ్ సర్వీస్

పోలీసు శాఖను మోసగించి మళ్లించుకున్న నగ దుతో పాటు మరికొంత సొమ్ము కలిపి రూ.41 కోట్లతో అమెజాన్లో క్లౌడ్ సర్వీసెస్ కొనుగోలు చేసి దాని ద్వారా పలు రాష్ట్రాల్లోని కంపెనీలకు 52 రకాల సేవలు అందిస్తూ వ్యాపారాన్ని విస్తరించుకున్నారని ఐజీ వివరించారు.‘అవినాష్కు సంబంధించి రూ.13 కోట్ల విలువైన 16 ఆస్తులు జప్తు చేశాం.వాటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.30 కోట్లకు పైగా ఉంటుంది.క్లౌడ్ సర్వీసెస్ సేవలకు ఆయా కంపెనీల నుంచి ఆయనకు రావాల్సిన సేవా రుసుములు మరో రూ.25 కోట్ల దాకా ఉంటాయి.దుర్వినియోగమైన రూ.36.58 కోట్లను వీటన్నింటి ద్వారా రాబట్టు కుంటాం’ అని ఐజీ పాలరాజు చెప్పారు.పోలీసుశా ఖకే ఇలాంటి మోసం జరగడం దురదృష్టకరమ న్నారు.రేజర్ పీఈ డైరెక్టర్లు మరో ఇద్దరి ప్రమేయం పైనా ఆరా తీస్తున్నామని.వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు.‘ఈ వ్యవహారం వెలుగుచూసిన ప్పటి నుంచి ఈ-చలానాల వసూళ్లు నిలిపివేశాం.ఇకపై నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ద్వారా చలానా రుసుములు పోలీసు శాఖకు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అని వెల్లడించారు.

ప్రజాధనంతో భారీగా స్థిర, చరాస్తుల కొనుగోలు

పోలీసు శాఖకు చెందాల్సిన రూ.కోట్ల సొమ్మును తన సొంత ఖాతాలోకి మళ్లించుకుని భారీ మోసానికి పాల్పడిన అవినాష్ ఆ ధనంతో పెద్దమొత్తంలో స్థిర, చరా స్తులు సమకూర్చుకున్నారు.మాజీ డీజీపీ ఎన్.సాంబశివరావు అల్లుడైన అవినాష్ 2019లో ఏపీ పోలీసు శాఖకు చెందిన ట్రాఫిక్ ఇ-చలానా రుసుముల కాంట్రాక్టు దక్కిం చుకున్నారు.ఆ తర్వాతే హైదరాబాద్-రంగారెడ్డి ప్రాంతా ల్లో అపార్టుమెంట్లు, విల్లాలు, ప్లాట్లు, ఖాళీ స్థలాలు కొన్నట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది.

ఈ కేసులో ఏ2గా గుర్తించిన రాజశేఖర్ పేరుతో ఒంగోలులో అయి దంతస్తుల భారీ భవన నిర్మాణం చేపట్టినట్లు గుర్తిం చారు.ఏడాదిన్నర క్రితం హైదరాబాద్లో ఓ షోరూంలో కోటికి పైగా వెచ్చించి కారు కొన్నారు.

తన వద్ద పని చేసే సుమారు 30 మంది ఐటీ ఉద్యోగులకు జీతాభ త్యాలు, వారికి వ్యక్తిగత రుణాలు ఈ ఖాతా నుంచే చేసినట్లు గుర్తించారు.కర్ణాటక, హైదరాబాద్లోని పలు బ్యాంకుల్లో రేజర్ పీఈ పేరుతో ఖాతాలు తెరిచారు.

తెలంగాణలో మెడికల్ సర్వీసెస్ విభాగాలతో పాటు డిస్కం సంస్థలకు సేవలు అందిస్తున్నారు.కేంద్ర ప్రభు త్వానికి కూడా కొన్ని సర్వీసెస్ ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube