క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారని ఆరోపణ నేపథ్యంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాస్ నోటీస్ జారీ చేసిన విషయం తెలిసింది.10 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తారిఖ్ అన్వర్ అక్టోబర్ 22న లోక్ సభ సభ్యుడికి నోటీసు జారీ చేశారు.తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ నవంబర్ 1న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి సంజాయిషి ఇచ్చారు.మునుగోడు ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థికి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మద్దతివ్వాలని కాంగ్రెస్ నేత వెంకట్‌రెడ్డి కోరినట్లు సోషల్‌మీడియాలో వాయిస్ రికార్డింగ్ వైరల్‌గా మారడంతో నోటీసులు జారీ అయ్యాయి.

వెంకట్ రెడ్డి తన సమాధానంలో అది ఫేక్ ఆడియో అని పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది.తాను పార్టీలో సీనియర్ నాయకుడని, గత 35 ఏళ్లుగా సంస్థకు సేవలందిస్తున్నానని తెలిపారు.పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోయారు.కోమటిరెడ్డి విషయంలో చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎప్పటికైనా పార్టీ నుండి వెళ్లిపోతారని వారు భావిస్తున్నారు.
తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే పార్టీని వీడిన విషయం తెలిసింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి బిజెపిలోకి వెళ్లడానికి తన కు లభించిన కాంట్రాక్ట్లే కారణమని ఇప్పటికే పలువు నేతలు ఆరోపించారు.బిజెపి నుంచి ఆఫర్లు లభిస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గోడ దుంకాడానికి రెడీగా ఉంటాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో అది జరగవచ్చు అని వారి అంచనా.