కోలీవుడ్ బ్యూటీ వాణి భోజన్( Vani Bhojan ) గురించి మనందరికీ తెలిసిందే.ఈమె మొదట మీకు మాత్రమే చెప్తా సినిమా( Meeku Maathrame Cheptha )తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుంది.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో ఈ ముద్దుగుమ్మకు సరైన గుర్తింపు దక్కలేదు.
ఈ సినిమా తర్వాత నటించిన తమిళ సినిమా ఓ మై కడవలే తో భారీగా గుర్తింపు తెచ్చుకుంది.అయితే మొదట బుల్లితెర నటిగా 2010లో కెరిర్ ను ప్రారంభించిన వాణి భోజన్ ప్రస్తుతం హీరోయిన్గా ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది.

హీరోయిన్ గా వరుసగా అవకాశాలను అందుకుంటున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు సరైన పెద్ద హిట్ సినిమా ఒక్కటి కూడా పడటం లేదు.కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ కోలీవుడ్( Kollywood )లో మంచి సక్సెస్ కోసం పోరాడుతోంది.మధ్యలో సరైన అవకాశాలు లేకపోవడంతో వెబ్ సిరీస్ వైపు మొగ్గు చూపింది.దాదాపుగా స్టార్ హీరోయిన్ హోదా కోసం 13 ఏళ్లుగా కష్టపడుతోంది.ప్రస్తుతం కోలీవుడ్ పైనే దృష్టి సారించింది ఈ ముద్దుగుమ్మ.తాజాగా ఆమె చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి.
వాటిలో రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.మరో చిత్రం షూటింగ్ దశలో ఉంది.
ఇది ఇలా ఉంటే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది హీరోయిన్ వాణి.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.

కథకు అవసరం లేకపోయినా కొన్ని సన్నివేశాల్లో నటించాలని ఒత్తిడి ఉంటోందని ఆవేదన వ్యక్తం చేసింది.ముఖ్యంగా ఒక చిత్రంలో అనవసరంగా బెడ్‌రూం సన్నివేశం( Bed room scene )లో నటించాలని చెప్పారని,అదీ ముందుగా ఎలాంటి సమాచారం లేకుండా చేయమని అడిగారు.అప్పుడు నేను అలాంటి సన్నివేశంలో నటించనని మొహం మీదే చెప్పేశాను అని చెప్పుకొచ్చింది వాణి.అలాగే తనకు డబ్బు మాత్రమే ముఖ్యం కాదని నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేయడమే ముఖ్యమని పేర్కొంది.







