టీడీపీ నేత కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.
కాగా మద్యం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కొల్లు రవీంద్ర కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.అయితే టీడీపీ హయాంలో కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మినిస్టర్ గా పని చేశారు.
ఆ సమయంలోనే మద్యం కంపెనీలకు చట్ట విరుద్ధంగా అనుమతి ఇచ్చారని సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే కేసులో కొల్లు రవీంద్రను ఏ2గా సీఐడీ అధికారులు పేర్కొన్నారు.