డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) తెరకెక్కించిన “వ్యూహం” సినిమా( Vyuham Movie ) వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే.డిసెంబర్ చివరి వారంలో విడుదల కావలసిన ఈ సినిమా కోర్టు తీర్పులతో రిలీజ్ వాయిదా పడటం జరిగింది.
వైసీపీ అధినేత జగన్ కి అనుకూలంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకి వ్యతిరేకంగా రాంగోపాల్ వర్మ ఈ సినిమా చిత్రీకరించినట్లు తెలుగుదేశం నేతలు మండిపడటం జరిగింది.దీంతో “వ్యూహం” సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని నారా లోకేష్( Nara Lokesh ) హైకోర్టులో పిటిషన్ కూడా వేయడం తెలిసిందే.
ఇదిలా ఉంటే రాంగోపాల్ వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తానని టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాస్…( Kolikapudi Srinivas ) ఓ ప్రముఖ టీవీ ఛానల్ లైవ్ డిబేట్ లో కామెంట్లు చేయడం జరిగింది.
ఈ విషయంపై రాంగోపాల్ వర్మ పోలీస్ కంప్లైంట్ ఇవ్వటంతో కేసు కూడా నమోదయింది.దీంతో ఇటీవల కొలికపూడి సీఐడీ విచారణ( CID Inquiry ) కూడా ఎదుర్కొన్నారు.అయితే మరోసారి కొలికపూడి.
రాంగోపాల్ వర్మకి వార్నింగ్ ఇచ్చారు.కొలికపూడి ఏమన్నారంటే “నాపై కేసు పెట్టాక రాంగోపాల్ వర్మ కి ఫోన్ చేస్తే అతడు లిఫ్ట్ చేయలేదు.
ఆర్జీవి సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టకుండా.ఒళ్ళు దగ్గర పెట్టుకునీ సినిమాలు తీయాలి.
మళ్లీ ఈ నెల 8వ తారీఖున విచారణకు రావాలని సీఐడీ అధికారులు చెప్పారు అని స్పష్టం చేయడం జరిగింది.