అరుదైన రికార్డు కోల్పోయిన కోహ్లీ.. అయ్యో అని నిరాశ పడుతున్న ఫ్యాన్స్..!

ప్లే గ్రౌండ్ లో పరుగుల వరద పారించే విరాట్ కోహ్లీ గత రెండేళ్లుగా పేలవమైన ప్రదర్శనతో బాగా నిరాశ పరుస్తున్నాడు.దీనికితోడు ఇంతకుముందు అతను సాధించిన రికార్డ్స్ అన్నీ కూడా ఇప్పుడు వాటంతట అవే చెరిగిపోతున్నాయి.

 Kohli Loses Rare Record, Virat Kohli,rare Record, Loss, Netizens, Fans-TeluguStop.com

తాజాగా అతడి పేరు మీద ఉన్న ఓ అరుదైన రికార్డు కూడా ఇప్పుడు క్రికెట్ హిస్టరీలో నుంచి చెరిగిపోయింది.టెస్ట్, వన్డే టీ20 ఇలా అతను అన్ని ఫార్మాట్లలో కూడా ఇప్పుడు రెండేళ్లుగా ఒక్క సెంచరీ సాధించిన దాఖలాలు లేవు.

దీంతో అతని యావరేజ్ స్ట్రైక్ రేట్ బాగా పడిపోతూ వస్తోంది.

మొన్నటిదాకా కోహ్లీ అన్ని ఫార్మాట్లలోనూ 50+ సగటు రన్ రేట్ కలిగిన క్రికెటర్ గా ఉన్నాడు.

కానీ తాజాగా కోహ్లీ శ్రీలంక టెస్ట్ సిరీస్ లో చాలా తక్కువ పరుగులు చేసి, ఔట్ అయి ఈ రికార్డుని కోల్పోయాడు.ఇప్పుడు కోహ్లీ యావరేజ్ 49.96కి పడిపోయింది.దాంతో ప్రతి ఫార్మాట్లో కూడా 50 పరుగులకు పైగా యావరేజ్ కలిగి ఉన్న ఏకైక ఆటగాడిగా ఉన్న కోహ్లీ ఇప్పుడు ఆ రికార్డును కోల్పోవాల్సి వచ్చింది.

దీంతో ఫ్యాన్స్ అయ్యో అని నిరాశ పడుతున్నారు.విశేషమేమిటంటే, ఆరేళ్ల తర్వాత కోహ్లీ సగటు రన్ రేట్ ఇలా 50 కంటే తక్కువకు పడిపోయింది.
2019లో టెస్టుల్లో అతని రన్ రేట్ 54.97 గా ఉండేది.కానీ ఇప్పుడది బాగా తగ్గు ముఖం పట్టింది.అదే ఏడాదిలో అతని అత్యుత్తమ బ్యాటింగ్ సగటు 55.10 కి ఎగబాకింది.అలా అద్భుతమైన బ్యాటింగ్ తో కోహ్లీ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రన్ రేట్ నమోదు చేశాడు.

కానీ ఇప్పుడు ఫామ్ కోల్పోయి కనీస ఫర్ఫార్మెన్స్ కూడా ప్రదర్శించ లేక ఫ్యాన్స్ ని బాగా డిసప్పాయింట్ చేస్తున్నాడు.మరి ఇప్పటికైనా కోహ్లీ పుంజుకుని గతంలో లాగా పరుగుల వరద పారిస్తాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube