టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ( Virat Kohli ) ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అతడు ఫామ్‌లో లేనప్పటికీ, అతని ఆటను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియాలకు తరలి వస్తుంటారు.
కోహ్లీ కనిపిస్తే కనీసం అతనితో ఫొటో దిగాలని, షేక్ హ్యాండ్ ఇవ్వాలని అభిమానులు ఉత్సాహంగా ఎగబడతారు.అయితే, తాజాగా కోహ్లీ ఓ మహిళను స్వయంగా దగ్గరికి వెళ్లి హత్తుకోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది? ఆ మహిళ ఎవరన్నది తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆరాటపడుతున్నారు.

ఇంగ్లాండ్‌తో మూడో వన్డే మ్యాచ్ ( ODI match against England )కోసం టీమిండియా అహ్మదాబాద్ బయలుదేరడానికి భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది.ఎయిర్‌పోర్ట్ చెకింగ్ ఏరియాలో కొంతమంది అభిమానులు తమ క్రికెట్ హీరోలను చూసేందుకు అక్కడికి వచ్చారు.అదే సమయంలో కోహ్లీ గుంపులో ఉన్న ఓ మహిళను చూసి నవ్వాడు.
నవ్వుతూనే ఆమె దగ్గరికి వెళ్లి హాగ్ చేసుకున్నాడు.అతడు ఆ మహిళను హత్తుకోవడం చూసి అక్కడున్న ఇతర అభిమానులు ఆశ్చర్యపోయారు.
వెంటనే కోహ్లీకి షేక్ హ్యాండ్ ఇవ్వాలని ప్రయత్నించారు.అయితే సెక్యూరిటీ సిబ్బంది వెంటనే కలుగజేసుకొని కోహ్లీని అక్కడి నుంచి ఆయనను పంపించారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో చూసిన నెటిజన్లు, ‘‘ఆ మహిళ ఎవరు?’’ అంటూ తెగ ప్రశ్నలు వేస్తున్నారు.చివరకు ఆమె కోహ్లీకి అత్యంత సమీప బంధువు అని సమాచారం.అందుకే ఆమెను చూసి కోహ్లీ సంతోషంగా హత్తుకున్నాడని తెలుస్తోంది.
ఈ సంఘటనపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.ఇంత ఆప్యాయంగా హత్తుకోవడం చాలా మంచి విషయం అని కొందరు కామెంట్ చేస్తున్నారు.







