జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణా రాష్ట్రంలూ తన రాజకీయ యాత్ర చేస్తున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే.అయితే పవన రాజకీయ యాత్రలు చేస్తోంది ఎందుకు అసలు తానూ ఇప్పుడు ఈ యాత్ర చేయవలసిన అవసరం ఏమొచ్చింది.? అని అడిగితే గుక్క తిప్పుకోకుండా సామాధానం చెప్పగలడా.?ఉండదు తన దగ్గర సమాధానం ఉండదు.ఎందుకంటే తెలంగాణా సీఎం ,ఆంధ్రా సీఎం ఇద్దరు సూపర్ స్మార్ట్ సీఎం లే.మంచి పాలన ఇస్తున్నారు అని అంటూనే ప్రజల అవసరాలు భాదలు తీరుస్తా అంటూ యాత్ర మొదలు పెట్టాడు.అదోక తలా తోకా లేని యాత్ర అంటూ కాంగ్రెస్ ,బీజేపి లు కొట్టిపారేస్తున్నాయి.అయితే కోదండరాం పవన్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు
పవన్ కళ్యాణ్ యాత్ర చేస్తున్నారు కదా దానిపై మీ అభిప్రాయం ఏమిటి అని మీడియా వారు అడుగగా పవన్ అయితే ఏంటి తన గురించి మాట్లాడి నా స్థాయిని నేను తగ్గించుకోవాలా అంటూ ఊకలో ఈకలా తీసి పడేశారు కోదండరాం.
పవన్ అనే వాడి గురించి నేను మాట్లాడి నా స్థాయిని నేను తగ్గించుకోను…అసలు అలాంటి వాళ్ళ గురించి మీరు ఆలోచించకండి టైం వేస్ట్ అన్నట్టుగా సమాధానం ఇచ్చారు కోదండరాం.
అయితే తెలంగాణలో పర్యటన చేస్తున్న పవన్ కి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఉద్యమం సమయంలో యాడికి పోయావ్ కొడకా అంటూ ముసలవ్వలు సైతం పరేషాన్ చేస్తున్నారట.పవన్ కళ్యాణ్ పై మేధావులు సైతం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అసలు నువ్వు ఎవరి గురించి తిరుగుతున్నావ్.? నీ లక్ష్యం ఏమిటి.? అంటూ ప్రశ్నిస్తుంటే ప్రస్నిస్తాను అని చెప్పిన పవన్ బాబు మాత్రం చప్పిడి చేయడం లేదని అంటున్నారు.







