సీఎం జగన్ పై సినిమా తీయాలన్నా, పవన్ కళ్యాణ్ ట్విట్ కు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.నిజ జీవితంలో హీరో అయిన జగన్ ను పెట్టి తీసే సినిమాలో, చంద్రబాబును విలన్ గా, 420 బ్యాచ్ ఆయనకు అసిస్టెంట్లుగా నటించాలని కొడాలి నాని సూచించారు.
అవసరమైతే దర్శకుడు రాంగోపాల్ వర్మతో తాను స్వయంగా మాట్లాడుతానని ఆయన అన్నారు.2024 ఎన్నికల తర్వాత హీరో లాంటి జగన్, ప్రతిపక్షాల నేతలందరినీ నడిరోడ్డుపై నించో పెట్టక తప్పదని,ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ కు మిగిలేది ప్యాకేజీ డబ్బు, సినిమాలేనని కొడాలి నాని స్పష్టం చేశారు.