శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మూడు నామాలే ఎందుకు అలంకరిస్తారో తెలుసుకోండి..?

శ్రీ వెంకటేశ్వర స్వామి( Sri Venkateswara Swamy ) వారి రూపాన్ని తలచుకోగానే ముందుగా అందరికీ గుర్తు వచ్చేది ఏడుకొండలు, మూడు నామాలు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ముఖ్యంగా చెప్పాలంటే స్వామి వారి రూపంలో ముందుగా ఆకట్టుకునే అత్యంత ప్రత్యేకమైన ఈ నామాల వెనుక దాగున్న అర్థం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చెప్పాలంటే ఐదు సంవత్సరాల లోపు పిల్లలలో మనం చూసేది సత్వగుణం.ఈ సత్వగుణం మనుషులలో ఉంటే అది మనిషిని ఉన్నతమైన మార్గంలో, ఉత్తమ లక్ష్యం వైపు నడుపుతుంది.

తెల్ల నామాలు సత్వ గుణాన్ని దాని వల్ల కలిగే ఉద్రేక రహిత స్థితిని తెలియజేస్తాయి.అది పునాదిగా ఉండాలని కింద పాదపీఠం ఉంటుంది.సత్వగుణం మనల్ని ఉన్నత స్థితికి తీసుకు వెళుతుందని సూచించేదే నిలువ బొట్టు.

సత్వగుణానికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు ( Shri Mahavishnu )వెనుక రెండు తెల్లని ఊర్ధ్వ పుండ్రాలు ఆయన పాదాలుగా శిరసావహిస్తారు.ఇక విశ్వమంతా వ్యాపించిన అనురాగానికి ప్రతీక లేత ఎరుపు రంగు.

Advertisement

అంటే ఎరుపు లక్ష్మీ స్వరూపం, శుభ సూచకం, మంగళకరమైనది.కాబట్టి తెలుపు నామాల మధ్యలో ఎరుపు చూర్ణం ఉపయోగిస్తారు.

ఇది మొట్ట మొదటి సారి రామానుజాచార్యులు( Ramanujacharyulu ) స్వయంగా తన స్వహస్తాలతో స్వామికి మూడు నామాలు అలంకరించారు.అలా శ్రీనివాసుడికి తిరునామాలు అలంకరించడం ఆనవాయితీగా మారింది.శుక్రవారం ఉదయం మాత్రమే అభిషేక సేవ ప్రారంభంలో శ్రీవారు మూడు నామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు.

శుక్రవారం అభిషేకం తర్వాత మూడు నామాలు అలంకరిస్తే మళ్లీ వచ్చే శుక్రవారం అభిషేకం సమయం వరకు ఈ నామాలు అలానే ఉంటాయి.అంటే వారానికి ఒక్కసారి మాత్రమే శ్రీవారికి మూడు నామాలు దిద్దుతు ఉంటారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్29, ఆదివారం 2024
Advertisement

తాజా వార్తలు