సద్దుల బతుకమ్మ ఇష్టమైన సత్తు ముద్దలు ఎలా చేస్తారో తెలుసా?

తెలుగు క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో అంగరంగ వైభవంగా బతుకమ్మ దసరా ఉత్సవాలు జరుపుకుంటారు.

తెలంగాణలో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ తెలంగాణా సంస్కృతినీ చాటి చెబుతుంది.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది రోజులపాటు దేవీ నవరాత్రి ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.ఈ తొమ్మిది రోజులు రెండు తెలుగు రాష్ట్రాలలో పండగ వాతావరణం నెలకొని భక్తులు పెద్ద ఎత్తున నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొంటారు.

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా బతుకమ్మ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.ఈ బతుకమ్మ పండుగ కోసం వివిధ ప్రాంతాలలో ఉన్న ఆడబిడ్డలు తమ ఇంటికి చేరుకొని బతుకమ్మ ఈ పండుగను ఎంతో వేడుకగా చేసుకుంటారో.

ఈ క్రమంలోనే వివిధ రకాల పుష్పాలతో ఎంతో అందంగా బతుకమ్మను అలంకరించి రోజుకు ఒక రూపంలో తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లతో ఆ గౌరవమ్మను పూజిస్తారు.ఇలా ఎంగిలి బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ ఉత్సవాలు.

Advertisement
Know The Saththu Mudda On Last Day Of Saddula Bathukamma Here Special Story Bhat

సద్దుల బతుకమ్మతో పూర్తవుతాయి.ఇక చివరి రోజు సద్దుల బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు.

చివరి రోజు అమ్మవారికి సత్తు ముద్దను నైవేద్యంగా సమర్పిస్తారు.

Know The Saththu Mudda On Last Day Of Saddula Bathukamma Here Special Story Bhat

అమ్మవారికి ఎంతో ఇష్టమైన సత్తు ముద్దలు వివిధ రకాల దాన్యాలతో తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.బియ్యం, జొన్నలు, నువ్వులు ,వేరుశనగ పల్లీలు మొదలైన ధాన్యాలను దోరగా వేయించుకొని చల్లారాక మెత్తని ముద్దగా దంచి పక్కన పెట్టుకోవాలి.ఆ తర్వాత చక్కెర నెయ్యి కలిపితే సత్తుపిండి తయారైనట్లే.

తర్వాత బెల్లంతో లేత పాకం పట్టుకుని ఈ పిండిని అందులో కలిపి చిన్నచిన్న ముద్దలుగా తయారు చేసుకుంటే అమ్మ వారికి ఎంతో ఇష్టమైన సత్తు ముద్దలు తయారైనట్లే.ఈ సత్తు ముద్దలను చివరి రోజు సద్దుల బతుకమ్మ కి నైవేద్యం సమర్పిస్తారు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు