లీటర్లకు లీటర్లు నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది అని తాగేస్తున్నారా..? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో..

సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.ఆరోగ్యానికి మేలు చేసేది ఏదైనా కూడా వాటిని తీసుకోవడానికి ముందుకు వెళ్తారు.

అయితే ఆరోగ్యానికి మేలు చేసేది ఏదైనా కూడా ఎక్కువగా తీసుకుంటే అది జీవితంలో విషంలా మారుతుంది.అయితే తాగునీరు( Drinking Water ) శరీరంలోని నీటి సముల్యతనీ కాపాడుతుంది.

అలాగే మలినాలను బయట పంపించడంలో కూడా సహాయపడుతుంది.కానీ నీటిని కూడా అధికంగా తీసుకోవడం శరీరం పై ప్రతికూల ప్రభావాలు పడతాయి.

అయితే గురుగ్రామ్ లోని నారాయణ హాస్పిటల్ లోని డైటీషియన్ పర్మిత్ కౌర్ పలు అంశాలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీరు తాగడం పై పలు అంశాలు పంచుకుంది.

Advertisement

నీటిని కూడా అవసరమైన దానికంటే ఎక్కువగా తాగడం వల్ల రక్తం పరిమాణం పెరుగుతుందని ఆమె తెలిపింది.ఎక్కువ నీటిని ఫిల్టర్ చేయడానికి మూత్రపిండాలపై ఒత్తిడి పడుతుందని ఆమె చెప్పారు.

దీనివల్ల గుండెపై( Heart ) మరింత భారం పడుతుందని అలాగే కడుపులో మంట పెరుగుతుందని ఆమె తెలిపారు.అంతే కాకుండా ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్( Electrolyte ) సమతుల్యత దెబ్బతింటుందని, రక్తంలో సోడియం స్థాయి తగ్గుతుందని, దీనివల్ల హైపోనాట్రేమియా అనే పరిస్థితికి కారణమవుతుందని ఆమె తెలిపింది.హైపోనాట్రేమియా ద్వారా శరీరంలో వికారం, తలనొప్పి, బలహీనత, చిరాకు, కండరాల తిమ్మిరి లాంటివి వచ్చే ప్రమాదం ఉంది.

అందుకే ప్రతిరోజు 9 నుండి 13 గ్లాసుల వరకు మాత్రమే నీరు తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చు.

నీరు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీ నిరంతరం పని చేయాల్సి ఉంటుంది.అందుకే తరచూ మూత్ర విసర్జన చేయడం వలన కిడ్నీలు మరింత ఒత్తిడికి గురవుతాయి.ఇక ఓవర్ హైడ్రేషన్ కు కూడా ఇది దారి తీస్తుంది.

ఓట్స్ ఆరోగ్యాన్నే కాదు హెయిర్ గ్రోత్ ను పెంచుతాయి.. ఇంతకీ ఎలా వాడాలంటే?
రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?

అంతేకాకుండా శరీరంలో పొటాషియం స్థాయి తగ్గుతుంది.దీనివల్ల చాలాసేపు విరేచనాలు, చెమటలు పడతాయి.

Advertisement

క్లీవ్ ల్యాండ్ క్లినిక్ వెబ్సైట్లో ఒక నివేదిక ప్రకారం హైపోకలేమియా తరచుగా నేరుగా జీర్ణ వ్యవస్థ పై ప్రభావితం చేస్తుంది.దీనివల్ల వాంతులు, విరేచనాలు లాంటి సమస్యలు తలెత్తుతాయి.

తాజా వార్తలు