ఆ విషయంలో కింగ్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్..!

టీమ్ ఇండియా సూపర్ స్టార్ బ్యాట్స్మెన్, వికెట్ కీపర్ ఆయన కేఎల్ రాహుల్ తాజాగా జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో తనదైన మార్క్ బ్యాటింగ్ చేపడుతూ ఆకట్టుకుంటున్నాడు.

ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా పంజాబ్ జట్టు గెలుపు ఓటములతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో కేఎల్ రాహుల్ మాత్రం తనదైన బ్యాటింగ్ శైలితో పరుగులను రాబడుతున్నాడు.

ఇకపోతే కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన అతడు పూర్తిగా మారిపోయాడు.జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు వహించిన తర్వాత అతడు పరుగుల వరద కొనసాగిస్తున్నాడు.

గత సంవత్సరం జరిగిన ఐపీఎల్ సీజన్ లో భాగంగా కె.ఎల్.రాహుల్ 670 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఇదే క్రమంలో తాజాగా కె.ఎల్.రాహుల్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.టీమిండియా కెప్టెన్, ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.టీ-20 ఫార్మెట్లో అత్యంత వేగంగా 5 వేల పరుగుల సాధించిన తొలి భారతీయ బ్యాట్స్మెన్ గా కె.ఎల్.రాహుల్ రికార్డు సాధించాడు.

విరాట్ కోహ్లీ 5 వేల పరుగులను టీ-20 ఫార్మెట్లో 167 ఇన్నింగ్సు లలో సాధించగా కె.ఎల్.రాహుల్ కేవలం 143 ఇన్నింగ్స్ లలోనే ఈ ఘనతను చేరుకున్నాడు.ఇందులో భాగంగానే కె.ఎల్.రాహుల్ కేవలం 76 ఇన్నింగ్స్ లలో 2808 పరుగులు చేసిన అతను 2 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఐపీఎల్లో సాధించాడు.ఈ రికార్డు ఇలా ఉండగా ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా అతడి తర్వాత టీమిండియా వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

Advertisement

అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

తాజా వార్తలు