వరంగల్: Bjp రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కామెట్స్…ప్రజా ధనం వృధా చేసిన కెసిఆర్ కు సిగ్గుండాలి.ఏమాత్రం విలువ ఉన్న వెంటనే పదవి నుంచి తప్పుకోవాలి.
కెసిఆర్ నిర్లక్ష్యం కారణంగా లక్ష కోట్ల ప్రాజెక్ట్ భవిష్యత్ అందకారంలో పడింది.ఫిల్లర్లు క్రాక్స్ వచ్చిన వార్త రాగానే కేంద్ర మంత్రిగా కేంద్ర జల శక్తి సంఘానికి లేఖ రాశాను.
లేఖ పై స్పందించిన కేంద్ర డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలనకు వచ్చింది.ప్రాజెక్ట్ ను పరిశీలించిన డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం నివేదిక నిన్ననే ఇచ్చింది.
అన్నారం బ్యారేజ్ ది కూడ అదే పరిస్థితి.ఒక్క టీఎంసీ నీళ్ళు అయిన నిల్వ చేసే పరిస్థితి వచ్చింది.
ప్రజల కట్టిన సొమ్ముతో కట్టిన ఈ ప్రాజెక్ట్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేసిన అంచనాలు మార్చి ప్రణాళిక లేకుండా నిర్మాణాలు చేశారు.
తెలంగాణ సమాజం మొత్తం చెప్పిన వినకుండా కెసిఆర్ నిర్మాణం చేశారు.ఇంజనియర్లు చెప్పిన వినకుండా సీఎం కెసిఆర్ ఎవరి మాట వినకుండా నిర్మాణం చేశారు.
నేడు ఈ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజలకు గుదిబండగా మారింది.ప్రజా ధనం వృధా చేసి నాసిరకం ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు.80 వేల పుస్తకాలు చదివిన మేధావి తెలంగాణ మేధావుల మాట వినకుండ ప్రాజెక్ట్ నిర్మాణం చేసి కోట్ల రూపాయల ప్రజాధనం గోదారిలో పోశారు.ప్రాజెక్ట్ గొప్పదని డిస్కవర్ చానలో ప్రసారం చేశారు.
కోట్ల రూపాయల ఖర్చు చేసి గొప్ప ప్రాజెక్ట్ అని ప్రచారం చేశారు.ఈ రోజు వరకు ముఖ్యమంత్రి నోరు మెదపలేదు.
పూర్తిగా బాధ్యత కెసిఆర్ వహించాలి.