Kiran abbavaram :నేను మంచిగా ఉన్నా కూడా నాకే ఎందుకు ఇలా జరుగుతోంది : కిరణ్ అబ్బవరం

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం( Kiran abbavaram ) గురించి మనందరికీ తెలిసిందే.

రాజా వారు రాణి గారు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

ఇక ఆ తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ అవి పరవాలేదు అనిపించాయి.అయితే సినిమాల ద్వారా కంటే ఎక్కువగా షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచారు కిరణ్ అబ్బవరం.

అందుకు గల కారణం కూడా లేకపోలేదు.ఒక వర్గం ప్రేక్షకులు కావాలనే కిరణ్ అబ్బవరంని టార్గెట్ చేస్తూ పలు రకాల విమర్శలు గుప్పించడం నెగిటివ్ కామెంట్ చేయడం చేశారు.

Kiran Abbavaram Talks About Trolls On Him At Rules Ranjann Movie Press Meet

ఇకపోతే కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం రూల్స్ రంజన్( Rules Ranjan ).ఇందులో నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ లో విడుదల చేయాలని భావించినప్పటికీ కానీ కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.

Advertisement
Kiran Abbavaram Talks About Trolls On Him At Rules Ranjann Movie Press Meet-Kir

సలార్ రిలీజ్ డేట్ పోస్ట్ ఫోన్ కావడంతో ఆ తేదీకి రూల్స్ రంజన్ సినిమాను విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావించారు.ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేశారు.

ఆ విషయాన్ని తెలపడానికి తాజాగా ఒక ప్రెస్ మీట్ ని కూడా నిర్వహించారు.దాంతో కిరణ్ అబ్బవరం సినిమా సెప్టెంబర్ 28న విడుదల కాబోతోందని సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొట్టింది.

Kiran Abbavaram Talks About Trolls On Him At Rules Ranjann Movie Press Meet

దీంతో కొంత మంది మళ్లీ కిరణ్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.కిరణ్ అబ్బవరం సినిమా వస్తుందనే భయంతోనే ప్రభాస్ తన సలార్ సినిమాను( Salaar ) వాయిదా వేసుకున్నారని కొందరు ఎగతాళి చేశారు.అయితే ఈ ట్రోల్స్ గురించి ఒక జర్నలిస్ట్ రూల్స్ రంజన్ ప్రెస్ మీట్‌లో కిరణ్ అబ్బవరంను ప్రశ్నించారు.

దీనికి కిరణ్ స్పందిస్తూ.అలాంటి ట్రోల్స్, మీమ్స్‌ను తాను ఇప్పుడు పాజిటివ్‌గా తీసుకుంటున్నానని తెలిపారు.

న్యూస్ రౌండప్ టాప్ 20

మా సినిమాను మొదట అక్టోబర్ 6న విడుదల చేయాలని అనుకున్నాం.ప్రభాస్ గారి సలార్ వాయిదా పడుతుందని తెలియగానే హాలీడే డేట్, చాలా మంది తేదీ అని టీమ్ మొత్తం చర్చించుకుని సెప్టెంబర్ 28న విడుదల చేద్దామని అనుకున్నారు.

Advertisement

నిన్న రాత్రి తేదీ ఖరారు చేసుకున్నాం.కానీ, అప్పటికే విషయం లీక్ అయ్యింది.

కొంత మంది మీమ్స్ అవీ వేశారు.అయినా ఫర్వాలేదు.

ఇంతకు ముందు నేను కొంచెం సీరియస్‌గా తీసుకునేవాడిని.అరె నాకే ఎందుకు ఇలా అవుతుంది అనుకునేవాడిని.

కానీ, ఇప్పుడు లైట్ తీసుకుంటున్నా.నేను ఎప్పుడైనా, ఎక్కడైనా చాలా మంచిగానే ఉంటున్నాను, మంచిగానే చేసుకుంటున్నాను.

కానీ ఎందుకు అలా జరుగుతుందో తెలీదు.అయినా ఫర్వాలేదు.

ఆ ట్రోల్స్, మీమ్స్ చూసి నేను నవ్వుకున్నాను.చాలా హ్యాపీగా ఫీలయ్యాను అని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు