ఆయనకు ఎప్పటికీ క్షమాపణలు చెప్పను.. మరోసారి బన్నీ పై విమర్శలు కురిపించిన ఆర్పీ!

జబర్దస్త్ కమెడియన్ గా అందరికీ ఎంతో సుపరిచితమైన కిరాక్ఆర్పీ ( Kirak Rp ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈయన ప్రస్తుతం జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమానికి దూరంగా ఉంటూ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ రెస్టారెంట్ బిజినెస్ పెట్టుకున్నారు.

అయితే ఇటీవల కాలంలో ఈయన రాజకీయాల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.కూటమికి మద్దతు తెలిపినటువంటి ఆర్పీ వైయస్సార్సీపీ నాయకుల పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలిచారు.

ఇలా రాజకీయ నాయకుల గురించి మాత్రమే కాకుండా సినీ నటుడు అల్లు అర్జున్ ( Allu Arjun ) గురించి కూడా విమర్శలు వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.ఈయన పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) కి కాకుండా తన స్నేహితుడు వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో ఆర్పీ అల్లు అర్జున్ గురించి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు .అయితే అల్లు అర్జున్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో బన్నీ ఫాన్స్ ఈయన రెస్టారెంట్లపై దాడి చేశారని కూడా వార్తలు వచ్చాయి.

ఇలా బన్నీ గురించి విమర్శలు చేసిన అనంతరం ఇటీవల కాలంలో కాస్త సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఈయన మరోసారి అల్లు అర్జున్ గురించి వైసీపీ నాయకుల గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.  ఇకపోతే రిపోర్టర్ ఈయనని ప్రశ్నిస్తూ అల్లు అర్జున్ సినిమాలలో మీకు ఛాన్స్ రాకపోతే అనే ప్రశ్న వేశారు.ఈ ప్రశ్నకు ఆర్పీ సమాధానం చెబుతూ అల్లు అర్జున్ కాకపోతే నాకు చాలా ప్రొడక్షన్ హౌస్ ఉన్నాయి అక్కడ నటిస్తాను ఆయన సినిమాలలో నటించాల్సిన అవసరం కూడా నాకు లేదని తెలిపారు.

Advertisement

అంతేకాకుండా నేను ఎవరికీ భయపడటం లేదని అలాగే అన్ని వదిలేసే ఇలా మాట్లాడుతున్నానని జీవితంలో తాను అల్లు అర్జున్ కే కాదు ఏ ఒక్కరికి క్షమాపణలు చెప్పేది లేదంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ లోకేష్ కనక రాజ్ కాంబో లో సినిమా వచ్చేది అప్పుడేనా..?
Advertisement

తాజా వార్తలు