టాలీవుడ్ లో రొమాంటిక్ హీరో అంటే అందరూ వెంటనే చెప్పే పేరు కింగ్ నాగార్జున.ఎక్కువగా ప్రేమ కథలతో సినిమాలు చేసిన నాగార్జున హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడంలో ముందు ఉంటాడు.
అలాగే కొత్త కొత్త హీరోయిన్స్ ని పరిచయం చేస్తూ కమర్షియల్ జోనర్ లోనే రొమాంటిక్ హీరోయిజం చూపిస్తూ సినిమాలు హిట్స్ కొట్టాడు.చివరికి వికలాంగుడుగా నటించిన ఊపిరి సినిమాలో కూడా తన స్టైల్ ఆఫ్ రొమాన్స్ ని నాగార్జున చూపించాడు.
అలాగే టాలీవుడ్ లో ఎక్కువగా కొత్త దర్శకులకి అవకాశాలు ఇస్తూ, ప్రయోగాలకి పెద్ద పీట వేసే హీరోగా నాగార్జున కి మంచి గుర్తింపు ఉంది.
ఈ మధ్య కాలంలో నాగార్జునకి సరైన హిట్ పడలేదు.
అతనికి మంచి సాలిడ్ హిట్ ఇచ్చిన చివరి చిత్రం ఊపిరి.ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తున్న అనుకున్న స్థాయిలో సక్సెస్ రావడం లేదు.
ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో పాటు, బంగార్రాజు సినిమాని త్వరలో సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు.వీటి మీద మంచి నమ్మకంతో నాగార్జున ఉన్నాడు.
వీటి తర్వాత రొమాంటిక్ కథలకి కింగ్ పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.అలాగే వయస్సు రీత్యా తనకి సరిపోయే పాత్రలు చేయాలని ఫిక్స్ అయిపోయినట్లు టాక్.
అందులో భాగంగా మల్టీ స్టారర్ సినిమాలైన కూడా తన పాత్ర ప్రాధాన్యత చూసుకొని చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.వయస్సు మళ్ళిన పాత్రలతో వచ్చే ఏడాది నుంచి సినిమాలు చేయాలని నాగార్జున డిసైడ్ అయినట్లు ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.