ఆవిడ వయస్సు 74 సంవత్సరాలు మెడలో చైన్ లు దొంగలించడం లో ఆ మహిళా వృద్ధురాలు ఆ వృద్ధ మహిళ దిట్ట పోలీసుల కళ్లుగప్పి 80 దొంగతనాలు చేసిందంటే ఎవరు నమ్మరు కానీ అదే నిజం చూడటానికి అమాయకం గా కనపడే ఆ వృద్ద మహిళ ఇప్పటివరకు పోలీసుల కళ్లుగప్పి అనేక నేరాలు చేసింది ఏదో ఒక రోజు పాపం పండుతుంది అన్న చందంగా వృద్ధ మహిళ పోలీసులకు చిక్కింది మహిళల మెడలో బంగారు ఆభరణాలు దోంగిలించే కిలాడీ బామ్మ ను క్రైం పోలీసులు అరెస్టు చేసారు గుంటూరు జిల్లా సత్తెనపల్లి చెందిన సరోజినీ అనే 74 సంవత్సరాల వృద్ద మహిళను అరెస్టు చేసిన పోలీసులు కృష్ణాజిల్లా నందిగామ పోలిసులు ఆరెస్ట్ చేశారు కిలాడి బామ్మా పై 41 పైగా కేసులు నమోదు కాగా నమోదు కాని కేసులు మరో 50 వరకు ఉన్నాయి అంటే అర్దం చేసుకోవచ్చు ఈ కిలాడి బామ్మ నిజరూపం ఇటీవల నందిగామ మండలం చెరువుకోమ్ముపాలెం లో గుడి ప్రతిష్ట లో 99గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ కీ గురయ్యాయి దింతో రంగంలోకి దిగిన పోలిసులు సిసి ఫుటేజ్ ఆధారంగా కేసు ను ఛేదించారు విజయవాడ, తెనాలి, రాజమండ్రి, మైలవరం లో కిలాడి బామ్మా పై పలు కేసులు నమోదు అయ్యాయి ఇప్పటి వరకు చోరి చేసిన నగలు నగదు తో ఈ ముసలమ్మ లగ్జరీ జీవితం గడిపారని పోలిసులు చెబుతున్నారు







