కియారాను ఉతికారేస్తున్న నెటిజెన్స్.. ఆ పనికి కూడా ఒకడు కావాలా అంటూ..

కియారా అద్వానీ.ఈమె బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ అందరికి సుపరిచితమే.

ఎందుకంటే బాలీవుడ్ సినిమాలతో పాటు మన సౌత్ సినిమాల్లో కూడా నటించి తన నటనతో మెప్పించింది.

ఇక ఇప్పుడు ఈమె అక్కడ మంచి మంచి అవకాశాలు అందుకుంటూనే సౌత్ లో కూడా స్టార్ హీరోలతో నటిస్తుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ కాంబోలో వచ్చిన భరత్ అనే నేను సినిమా ద్వారా కియారా అద్వానీ టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.ఈ సినిమాతో ఈ అమ్మడు సూపర్ హిట్ అందుకుంది.

ఈ సినిమా తర్వాత ఈమె అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.ఇటీవలే బాలీవుడ్ లో ఈమె నటించిన భూల్ భూలయ్య 2 సూపర్ హిట్ అయ్యి మంచి లాభాలను తెచ్చిపెట్టింది.

Advertisement

దీంతో ఈమెను లక్కీ హీరోయిన్ గా భావిస్తున్నారు.ఇది పక్కన పెడితే ఈమె మరోసారి ట్రోలర్స్ చేతికి చిక్కింది.

ఈమె చేసిన పనికి చాలా మంది నెటిజెన్స్ ఈమెపై ఫైర్ అవుతున్నారు.ఇంతకీ ఈమె ఏం చేసిందంటే.

ప్రెజెంట్ ముంబై లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కియారా గొడుకు పట్టించు కునేందుకు ఒక మనిషిని పెట్టుకుంది.ఈమె బయట కార్ దిగి వెళుతుంటే గొడుకు పట్టుకుని ఒక వ్యక్తి ఆమె తడవకుండా చూసుకున్నాడు.

ఈ విషయంపై ఈమెను నెటిజెన్స్ విమర్శిస్తున్నారు.గొడుగు పట్టుకునేందుకు కూడా ఒక మనిషి కావాలా? ఆ పని కూడా మీరు చేసుకోలేరా? మీ చేతులకు ఏమైంది? అంటూ ఈమెపై ఫైర్ అవుతున్నారు.

చాలా ఏళ్ళ గ్యాప్ తీసుకొని రిపీట్ అయిన హీరో-హీరోయిన్ల కాంబినేషన్లు ఏంటో తెలుసా ?

దీనికి సంబందించిన వీడియో బయటకు రావడంతో అది కాస్త వైరల్ అయ్యింది.ఇలా కియారా మాత్రమే కాదు గతంలో బాలీవుడ్ హీరోయిన్ లు చాలా మంది ఇలాంటి సంఘటనలలో విమర్శల పాలయ్యారు.ఇక ఇప్పుడు కియారా వంతు వచ్చింది.

Advertisement

ఇక ప్రెజెంట్ కియారా తెలుగులో రామ్ చరణ్ సరసన ఆర్సీ 15 సినిమాలో నటిస్తుంది.శంకర్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు అంతే భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.