మార్కెట్లో విడుదలైన కియా ఈవీ 9.. ధర, ఫీచర్స్ ఇవే..!

దక్షిణ కొరియాకు చెందిన కియా కార్ల కంపెనీ( Kia car company ) 2021లో కియా ఈవీ 6 ను విడుదల చేసి వినియోగదారులను ఎంతగానో ఆకర్షించింది.ఈ క్రమంలోనే కియా కంపెనీ కియా ఈవీ 9 తాజగా మార్కెట్లో విడుదల అయ్యింది.

 Kia Ev 9 Released In The Market The Price, Features Are The Same , Kia Ev 9 , Ki-TeluguStop.com

ప్రస్తుతం పర్యావరణ సమస్యల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపైకి వచ్చాయి.పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టి పెట్టడంతో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల( Electric vehicles ) హవ నడుస్తోంది.

అయితే ఈ కారు ముందుగా కొరియాలో విడుదల అయింది.త్వరలోనే యునైటెడ్ స్టేట్స్, యూరప్, ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది.ఈ మోడల్ ధర రూ.46.8 నుంచి రూ.52.5 లక్షల వరకు ఉండనుంది.

ఇక ఈ కారు ఫీచర్స్ విషయానికి వస్తే చార్జింగ్ పెట్టి వాహనాలలో ది బెస్ట్ అయ్యే అవకాశం ఉంది.కేవలం ఏడు నిమిషాలలో 80% చార్జింగ్ పూర్తి అవుతుందంట.ఎందుకంటే ఇందులో 77.4K లిథియం- అయాన్ పాలిమర్ బ్యాటరీ( Lithium-ion polymer battery ) ప్యాక్ తో వస్తుంది.కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో ఉండే ఎలక్ట్రిక్ వాహనాలకు, ఈ ఎలక్ట్రిక్ కారుకు మధ్య తేడా చాలానే ఉండనుంది.

ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే ఏకంగా 483 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

కాకపోతే ఈ కారు కంటే ముందు విడుదల అయినా ఈవీ6 ఏకంగా 501 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చింది.ఇక ఈ కారులో గ్రిల్ పై పిక్సెల్ ఎల్ఈడి లైట్లు ఎంతో ఆకర్షిస్తాయి.ఇక ఈ కారు పూర్తిగా E-GMP ఆధారపడుతుంది.కియా కంపెనీ అంతర్జాతీయంగా విక్రయాలు జరిపించడం కోసం ఏకంగా ఒకేసారి లక్ష కార్లను ఉత్పత్తి చేస్తుంది.2026 నాటికి 10 లక్షల కియా ఈవీ 9 కార్లను విక్రయించడమే కంపెనీ ప్రధాన లక్ష్యం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube