ఖమ్మం జిల్లా కారేపల్లిలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఘోర ప్రమాదం జరిగింది.సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చారు.
ఈ క్రమంలో కాల్చిన బాణసంచా నిప్పురవ్వలు ఎగిరిపడి ఓ గుడిసెకు మంటలు అంటుకున్నాయి.గుర్తించే లోపే మంటల ధాటికి గుడిసెలోని గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది.
ఈ ప్రమాదంలో ఒక్కరు మృత్యువాత పడగా.మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.
కాగా జిల్లాలో ఎమ్మెల్యే రాములు నాయక్, ఎంపీ నామా నాగేశ్వర రావు ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు.







