కేజీఎఫ్ సిరీస్ సినిమాలతో కైకాల సత్యనారాయణకు అన్ని రూ.కోట్ల లాభమా?

భారతీయ సినీ చరిత్రలో కేజీఎఫ్1, కేజీఎఫ్2 సినిమాలు ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే.ఈ రెండు సినిమాల బడ్జెట్ 150 కోట్ల రూపాయలు కాగా కలెక్షన్లు మాత్రం 1500 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.ఈ సినిమాలు అటు యశ్ కెరీర్ కు ఇటు ప్రశాంత్ నీల్ కెరీర్ కు ప్లస్ అయింది.కేజీఎఫ్3 దిశగా కూడా అడుగులు పడుతుండగా త్వరలో ఈ సినిమా షూటింగ్ పనులు జరగనున్నాయి.

 Kgf Series Is The Plus Point Kaikala Satyanarayana Family Details Here , Kaikala-TeluguStop.com

కేజీఎఫ్ సిరీస్ సినిమాలకు కైకాల సత్యనారాయణ కొడుకు కైకాల లక్ష్మీనారాయణ సహ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం.ఈ రెండు సినిమాల ద్వారా కైకాల కుటుంబానికి ఏకంగా 170 కోట్ల రూపాయల నుంచి 180 కోట్ల రూపాయల స్థాయిలో లాభాలు వచ్చాయని సమాచారం.కేజీఎఫ్ సిరీస్ సినిమాలు ఏ స్థాయిలో లాభాలను అందించాయో సులువుగా అర్థమవుతోంది.కేజీఎఫ్1, కేజీఎఫ్2 సినిమాలను మించి ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

కేజీఎఫ్3 లో యశ్ పాత్ర మళ్లీ బ్రతికి వస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రాకీ భాయ్ పాత్రకు యశ్ తన నటనతో జీవం పోశారనే చెప్పాలి.

యశ్ కు కేజీఎఫ్ సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది.శ్రీనిధి శెట్టికి కూడా ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టినా ఈ సినిమాల సక్సెస్ ఆమె కెరీర్ కు ఎక్కువగా ఉపయోగపడలేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

యశ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 50 కోట్ల రూపాయల నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.మరో రెండు వారాల్లో యశ్ కొత్త సినిమా ప్రకటన రానుంది.నర్తన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుందని వినిపిస్తున్నా ఈ ప్రాజెక్ట్ గురించి అధికారక ప్రకటన రావాల్సి ఉంది.కేజీఎఫ్3 సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని వివరాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube