KGF 2: తెలుగు రైటర్స్ మారాల్సిన టైం..తూటాల్లాంటి మాటలను చూసి నేర్చుకోండి ప్లీజ్

అందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న కన్నడ స్టార్ యశ్ నటించిన "కేజీఎఫ్ చాప్టర్ -2" సినిమా నిన్ననే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.

అయితే అందరూ ఊహించిన విధంగానే రికార్డ్ స్థాయిలో మంచి కలెక్షన్ లతో దూసుకుపోతుందితోంది.

ఈ సినిమా ముందు మరే చిత్రం నిలబడలేదు అన్నంతగా.తన స్టామినా ను చూపెడుతోంది.

ఒక సినిమా సక్సెస్ కేవలం కాసులు కురిపించడమీ కాదు.ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరచడంలో ఉంది అనడానికి ఈ సినిమానే చక్కటి ఉదాహరణ అంటున్నారు సినిమా విశ్లేషకులు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో కన్నడ చిత్రమైన కేజిఎఫ్ మూవీని తెలుగు సినిమాలతో పోలుస్తూ ఒక ఆట ఆడేసుకుంటున్నారు.ఈ సినిమాలో ప్రతి డైలాగ్ ఒక ఆణిముత్యమే.

Advertisement

ఎన్ని భారీ తెలుగు చిత్రాలలో పవర్ఫుల్ పంచ్ డైలాగ్ లు వెతికితే ఈ సినిమాకు సాటి అవుతాయి అంటూ ఎద్దేవా చేస్తున్నారు.కేజీఎఫ్ సినిమాలో డైలాగ్స్ కు ప్రేక్షకులు, విమర్శకులు సైతం బ్రహ్మరథం పడుతున్నారు.

ఈ చిత్రం లోని డైలాగ్స్ సమాజానికి విలువైన సందేశాల వర్షాలు కురిపిస్తున్నాయి అంటున్నారు.ఇటీవల కాలంలో తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి భారీగా పెరిగిన మాట వాస్తవమే.

దీనికి కారణం ఎవరయ్యా అంటే కేవలం హీరోలు, లేదా కేవలం దర్శకులో అంటే సరికాదు.అందుకు అందరి కృషి తోడయ్యింది అనే చెప్పాలి.

ఒక్కరితో ఇది సాధ్యం అయ్యే పనికాదు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ఎందుకంటే ఒక వంటకం బాగా కుదరాలి అందరూ మెచ్చుకోవాలి అంటే అందుకు కావల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం అన్ని ప్రధానమే.ఇదే తరహాలో ఒక సినిమా సక్సెస్ అవ్వాలి అంటే కథ, హీరో పర్ఫార్మెన్స్, మేకప్, దర్శకుడు పనితనం, డైలాగ్స్ హీరోయిన్.ఇలా అన్ని సమపాళ్లలో కుదిరితేనే హిట్ అవుతుంది.

Advertisement

ముఖ్యంగా హీరో తన హీరోయిజం చూపించడానికి పవర్ఫుల్ డైలాగులు అవసరం, అలాగే సమాజానికి స్ఫూర్తిని అందించాలి అన్నా అవే డైలాగ్స్ ప్రాధాన్యతను సంతరించుకుంటాయి.అయితే మన తెలుగు వారు ఈ విషయంలో కాస్త తక్కువనే చెప్పాలి.

ఒక రకంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి.ఒక సినిమా హిట్ అయితే ఇక ఆ హీరో కోట్లల్లో పారితోషకం డిమాండ్ చేస్తాడు.

అందులోనూ ఆ చిత్రంలో చెప్పుకోదగ్గ అలాగే సమాజానికి ఉపయోగపడే డైలాగులు అయిదో, ఆరో ఉంటే గొప్ప.దానికే ఆ హీరోకి ఎక్కడలేని క్రేజ్ అందులోనూ రెమ్యునరేషన్ కి రెక్కలు వస్తాయి.మరి దీనికే మురిసిపోతే పూర్తి స్థాయిలో అలరించేది ఎప్పుడు? తెలుగు రైటర్లు ఇకనైనా తెలివి తెచ్చుకొని ఉపయోగపడే డైలాగ్స్ రాయండి.ఒకటి రెండుతో సరిపెట్టకండి.

 అంటూ కన్నడ చిత్రమైన కే జి ఎఫ్ సినిమాని ఆకాశానికి ఎత్తుతూ తెలుగు సినీ పరిశ్రమను ప్రశ్నిస్తున్నారు.

తాజా వార్తలు