ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక?

‘సిరిసిరిమువ్వ’ సినిమాలోని ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక?’ అనే పాట రాజకీయాలకు చక్కగా సరిపోతుంది.ఎవరు ఎవరి పక్కన చేరుతారో తెలియదు.

 Key Strategist For Pm To Join Team Nitish-TeluguStop.com

ఎవరి ఎవరితో్ స్నేహం చేస్తారో, ఎవరు ఎవరితో విరోధం పెట్టుకుంటారో తెలియదు.మిత్రుడు అనుకున్నవాడు వీపులో కత్తి దింపుతాడు.శత్రువు అనుకున్నవాడు చేయి కలుపుతాడు.సరే…అసలు విషయం ఏమిటంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఆప్తుడు, ఆయన ఎన్నికల ప్రచారంలో కీలకంగా పని చేసిన వ్యూహకర్త ఇప్పుడు శత్రు శిబిరంలో చేరిపోయాడు.మోదీ శత్రువుకు ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేయబోతున్నాడు.ఆ వ్యక్తి పేరు కిషోర్‌.తలపండిన వ్యక్తి అనుకునేరు.కాదు.

జస్‌్ట ముప్పయ్‌ ఏడు ఏళ్లు మాత్రమే.ఇతను గత ఎన్నికల్లో మోదీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన వ్యూహకర్తగా పనిచేశారు.

ప్రస్తుతం బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ శిబిరంలో చేరారు.ఈ ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.

అందుకోసం ఇప్పటి నుంచే ప్రచార వ్యూహాలు పన్నుతున్నారు.ఆ బృందంలో ఉన్నాడు కిషోర్‌.

నితీష్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తానంటున్నాడు.కిషోర్‌ రాజకీయ నాయకుడు కాదు.

ఐక్యరాజ్య సమితిలో పబ్లిక్‌ హెల్‌్త నిపుణుడిగా పనిచేశారు.రెండువేల పదకొండో సంవత్సరంలో ఉద్యోగం వదిలేసి సాధారణ ఎన్నికల్లో మోదీ ప్రచార బృందంలో చేరాడు.

ఈ బృందం సామాజిక మీడియాను సమర్థంగా ఉపయోగించి, కొత్త ప్రచార విధానాలు, సాధనాల ద్వారా మోదీ విజయానికి కృషి చేసింది.ఇప్పుడు ఈ సేవలు నితీష్‌ కుమార్‌కు అందుతాయి.

బీహార్లో పాగా వేయాలనే భాజపాకు కిషోర్‌ వ్యూహాలు చెక్‌ పెడతాయా?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube