తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) ఇవాళ రెండు కీలక సమావేశాలను నిర్వహించనుంది.ఈ మేరకు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.
మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ సమావేశం జరగనుండగా.దీన్ని ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్( madhu yashki goud ) అధ్యక్షతన నిర్వహించనున్నారు.
ఇందులో ప్రధానంగా లోక్ సభ ఎన్నికల( Lok Sabha elections ) ప్రచార వ్యూహాంతో పాటు సభలు, సమావేశాలపై నేతలు చర్చించనున్నారు.అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగనుంది.
సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అధ్యక్షతన పీఈసీ సమావేశాన్ని నిర్వహించనున్నారు.కాగా ఈ భేటీకి ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, భట్టి విక్రమార్కతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు, పీఈసీ సభ్యులు హాజరుకానున్నారు.ఇందులో వచ్చే నెల 6న నిర్వహించనున్న జనజాతర సభ ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.