యూఏఈ లోని భారత కాన్సులేట్ కీలక సూచనలు.. ప్రవాసులు ఏం చేయాలి...ఏం చేయకూడదు...!!!

భారత్ నుంచీ ఎంతో మంది యూఏఈ దేశాలకు వలస కూలీలుగా ఉపాది కోసం వెళ్తూ ఉంటారు.

అక్కడి ప్రభుత్వాల నియమ, నిభందనలు తెలియక పోవడంతో ఉపాది కోసం వెళ్ళిన ఎంతో మంది కటకటాలు పాలయిన సందర్భాలు కోకొల్లలు.

ఒక వేళ వెళ్ళిన చోట ఉద్యోగం లేకపోతే, ఉద్యోగంలో చేరిన తరువాత యజమాని ఇబ్బందులు పెట్టినా, వేధింపులకు గురిచేసినా మనం ఏం చేయాలి, సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయాలు చాలామందికి తెలియదు.అసలు యూఏఈ లో ఉపాది కోసం వెళ్ళేవారు ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి ఏమున్నాయి.

అక్కడ మనం చేయకూడని పనులు ఏంటి, పాటించాల్సిన నిభందనలు ఏంటి అనే విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.ఈ విషయాలపై పరిజ్ఞానం లేకపోవడం కారణంగానే ఎంతో మంది భారతీయులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, జైలు పాలు అవుతున్నారు.

అందుకే యూఏఈ లోని భారత కాన్సులేట్ అక్కడ ఉండే భారతీయులకు కీలక సూచనలు చేసింది.యూఏఈ వెళ్ళిన ప్రతీ భారతీయుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే.

Advertisement

ముఖ్యంగా ప్రతీ ప్రవాస భారతీయుడు యూఏఈ లోని చట్టాలపై పట్టు పెంచుకోవాలి.ఈ చట్టాలు తెలియడం వలన మీరు ధైర్యంగా ఎలాంటి నిర్ణయాలు అయినా తీసుకునే అవకాశం ఉంటుంది.

అలాగే యజమానుల గృహ హింస, వేధింపులు, జీత భాద్యతాల విషయంలో సమస్యలు ఎదుర్కునే పరిస్థితి వస్తే తప్పకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.అక్కడ స్థానికంగా ఉండే భారత సంస్థల ఫోన్ నెంబర్ లు, భారత కాన్సులేట్ ఫోన్ నెంబర్ , పోలీసు వారి ఫోన్ నెంబర్ లు తప్పకుండా ఉంచుకోవాలి.

పని చేయడం ప్రారంబించిన నాటినుంచి ఫెన్షన్ స్కీమ్ ను మొదలు పెట్టాలి.ఏజెంట్ల వివరాలు మీ దగ్గర ఉంచుకోవాలి, అక్కడ ఎవరిని నమ్మకుండా మీ వ్యక్తిగత సమాచారం పై జాగ్రత్తను వహించండి.

ఇక అక్కడ చేయకూడని పనులు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

మత పరమైన విషయాలలో తల దూర్చకండి, ఎలాంటి అభ్యంతరకర పోస్టులు, యూఏఈ ని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో సందేశాలు పంపకండి.నిషేధిత ప్రాంతాలలో ఫోటోలు తీయవద్దు, అలాగే ఇతర వ్యక్తుల బ్యాంకు ఖాతా నెంబర్ లు అడగకూడదు, మీ ఖాతా వివరాలు, పిన్ నెంబర్, ఎటిఎం కార్డు నెంబర్ వివరాలు ఎవరికీ చెప్పకూడదు.బహిరంగ ప్రదేశాలలో దూమపానం, మద్యం నిషేధం.

Advertisement

మీరు పనిచేసే సంస్థ, లేదా యజమాని నుంచీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పోలీసులకు తెలియజేయండి, వారి నుంచీ పారిపోయే ప్రయత్నాలు చేయవద్దు.

తాజా వార్తలు